విన‌య విధేయ రామ అంటున్న రామ్ చ‌ర‌ణ్..

బోయ‌పాటి శీను సినిమా అంటే మాస్ టైటిల్స్ ఊహిస్తారు ప్రేక్ష‌కులు. దానికి త‌గ‌ట్టుగానే సింహా.. లెజెండ్.. ద‌మ్ము అంటూ ప‌వ‌ర్ ఫుల్ టైటిల్స్ బోయ‌పాటి ఖాతాలో ఉన్నాయి. అయితే ఏడాది కింది నుంచి ఎందుకో తెలియ‌దు కానీ ఈయ‌న రూట్ మార్చుకున్నాడు.

Ram-charan

బెల్లంకొండ శ్రీ‌నివాస్ సినిమాకు జ‌య జాన‌కీ నాయ‌క అంటూ సాఫ్ట్ టైటిల్ పెట్టాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇక ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ సినిమాకు కూడా ఇదే చేస్తున్నాడు బోయ‌పాటి. ఈ చిత్రానికి ఇన్ని రోజులు టైటిల్ స్టేట్ రౌడీ అని.. గ్యాంగ్ లీడ‌ర్ అని చాలానే వినిపించాయి కానీ ఇప్పుడు కొత్త టైటిల్ ఒక‌టి తెర‌పైకి వ‌చ్చింది. దాని పేరు విన‌య విధేయ రామ‌. అవును.. చాలా సాఫ్ట్ గా అనిపిస్తున్నా కూడా రామ్ చ‌ర‌ణ్ ఇమేజ్ కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా ఉంటుంద‌ని తెలుస్తుంది. ఇప్ప‌టికే షూటింగ్ చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. కైరాఅద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్ గా న‌టిస్తుంది. సంక్రాంతికి సినిమా విడుద‌ల కానుంది. మ‌రి ఈ విన‌య విధేయ రామ ఎలా ఉండ‌బోతున్నాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here