నా పేరు ర‌కుల్.. నా యిల్లు జిమ్ అంటున్న ముద్దుగుమ్మ‌..

అందమైన భామలు లేత మెరుపు తీగలు అంటూ హీరోయిన్ లను చూసి అంతా పాటలు పాడుకుంటూ ఉంటారు. దేవుడు ఎంత అందాన్ని ఇచ్చాడురా బాబూ అంటూ మిగిలిన అమ్మాయిలు కూడా కుళ్లుకుంటుంటారు. కానీ వాళ్లు అంత అందంగా ఉండటానికి నాజూగ్గా మారడానికి ఎంత కష్టపడతారో అనేది మాత్రం ఎవరూ అడగరు. ఇప్పుడు ఈ విషయంలో రకుల్ అందరికీ ఓ క్లారిటీ ఇచ్చింది. ఇంతకాలం ఇంత ఫిజిక్ అద్భుతంగా ఎలా మెయింటైన్ చేస్తున్నాను.. దానికి కార‌ణం ఏంటి అనేది బ‌య‌ట‌పెట్టింది ఈ భామ‌. దానికి కార‌ణం జిమ్ అంటూ తన అందాల రహస్యాలు బయట పెట్టింది. ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు కష్టపడతారు అంటూ వేదాంతం మాట్లాడుతుంది రకుల్ ప్రీత్ సింగ్.

 

 

View this post on Instagram

 

Burn calories this Dusshera 💪🏻 @toughtaskmaster #mftharrisonjames @harrysuch

A post shared by Rakul Singh (@rakulpreet) on


షూటింగ్ లేకపోతే తను జిమ్లోనే సమయం గడుపుతాన‌ని చెప్పింది ఈ ముద్దుగుమ్మ. ఇండస్ట్రీ కి వచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది రకుల్.. దానికి కారణం ఆమె జిమ్ లో కష్టపడే తత్వం.. నిత్యం వ‌ర్క‌వుట్స్ చేస్తూనే ఉంటుంది ఈ భామ‌. జిమ్లో వర్కవుట్ చేస్తూ కారే చెమట చుక్కలు తన అందాల రహస్యం అంటోంది ర‌కుల్. తాను కావాల్సినంత తింటాను అని ఆ తర్వాత ఆ తిన్నది అరగడానికి జిమ్ముకి వెళ్లి క‌ష్ట‌ప‌డ‌తాను అని చెబుతోంది. అందాన్ని కాపాడుకోవడానికి అంతకంటే మంచి మార్గం లేదని అందరికీ ఉచిత సలహాలు ఇస్తుంది ఈ ముద్దుగుమ్మ. మరి ఈమె ఇచ్చిన సలహాలు మిగిలిన హీరోయిన్లు ఎంత‌వ‌ర‌కు పాటిస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here