క్యాస్టింగ్ కౌచ్ పై మ‌ళ్లీ మాట్లాడిన ర‌కుల్..

ఢిల్లీ నుంచి గ‌ల్లీ వ‌ర‌కు ఇప్పుడు మీటూ ఉద్య‌మం ఓ రేంజ్ లో సాగుతుంది. ప్ర‌తీ ఒక్క హీరోయిన్ బ‌య‌టికి వ‌చ్చి త‌మ‌ను వాడుకున్నారంటూ సంచ‌ల‌న స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఇందులో స‌గానికి పైగా అబ‌ద్ధాలు చెబుతున్నారు.. ప‌బ్లిసిటీ కోసం చేస్తున్నార‌నే వాద‌న కూడా వినిపిస్తుంది.

ఇక ఇప్పుడు ఈ ఇష్యూపై ర‌కుల్ కూడా మాట్లాడింది. మ‌నం ఓ గీత గీసిన‌పుడు అది ఎలా బ‌య‌టికి క‌నిపిస్తుంది.. మ‌నం దాన్ని నిజంగా ఎలా గీసాం అనేది మ‌న‌కు మాత్ర‌మే తెలుస్తుంది. కానీ ఇక్క‌డ కూడా ఇదే జ‌రుగుతుంది. మ‌నం గీసింది ఒక‌టి.. బ‌య‌టికి క‌నిపిస్తుంది ఒక‌టి. ఎవ‌రైనా చాలా ర‌కాలుగా అమ్మాయిల‌ను ఇబ్బందులు పెడుతుంటారు.. నాతో ప‌డుకుంటేనే ప్రాజెక్ట్ వ‌స్తుంద‌న్న‌పుడు క‌చ్చితంగా ఆ నిర్ణ‌యం అమ్మాయి చేతుల్లో ఉంటుంది.

Rakul Preet Once Again Opens Up on Casting Couch
Rakul Preet Once Again Opens Up on Casting Couch

అప్పుడు ఎంత తెలివిగా త‌ప్పించుకుంటాం అనేది మ‌న‌కు తెలియాలి. ఇప్ప‌టికైనా అంతా బ‌య‌టికి వ‌చ్చి చెబుతున్నందుకు సంతోషంగా ఉంది అని చెప్పింది. త‌న జీవితంలో ఎప్పుడూ ఇలాంటి స‌మ‌స్య‌లు ఎదుర్కోలేద‌ని.. దానికి చాలా సంతోషంగా ఉంద‌ని చెప్పింది ర‌కుల్ ప్రీత్ సింగ్. అస‌లు క్యాస్టింగ్ కౌచ్ అంటే ఏంటో కూడా త‌న‌కు తెలియ‌ద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది ర‌కుల్.

అది తెలియ‌కుండానే ఇంత పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోయావా ర‌కుల్ అంటూ అప్ప‌ట్లో శ్రీ‌రెడ్డి ఈమెపై చాలా సెటైర్లు వేసింది. మ‌రి ఇప్పుడు ర‌కుల్ అన్న మాట‌లు వింటే శ్రీరెడ్డి మ‌ళ్లీ ఏం అంటుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here