ర‌జినీకాంత్ అభిమానుల‌ను మోసం చేస్తున్నాడా..?

ఇప్పుడు ఈ అనుమానం ఎందుకొచ్చింది అనుకుంటున్నారా..? ఎందుకంటే ఈయ‌న చేస్తున్న ప‌నులు చూస్తుంటే ఇప్పుడు ఇదే అడ‌గాల‌నిపిస్తుంది మ‌రి. ఈయ‌న తన అభిమానులను మోసం చేస్తున్నాడో లేదంటే మోసం చేయట్లేదు అని ఊహల్లో బతికేస్తున్నాడో అర్థం కావ‌డం లేదు.

Rajinikanth Playing high drama politics

ఓ వైపు రాజకీయాల్లోకి వస్తున్నానంటూ ఏడాది కింద పార్టీ ప్ర‌క‌టించి.. ఇప్పటి వరకు అది పట్టించుకోకుండా వరస సినిమాలు చేస్తున్నాడు రజనీకాంత్. ఒకప్పుడు మూడేళ్లకో సినిమా చేసిన రజినీకాంత్ ఇప్పుడు ఏడాదికి మూడు సినిమాలు చేస్తున్నాడు. అది అభిమానులకు సంతోషాన్నిచ్చే విషయమే అయినా కూడా ఈ ధ్యాస‌లో పడి రాజకీయాలు ఏమైపోయాయో అని కంగారుపడుతున్నారు అభిమానులు.

కరుణానిధి, జయలలిత ఇద్దరూ లేకపోవడంతో రజనీకాంత్ వారికి ప్రత్యామ్నాయంగా మారుతాడని ఆశించారు రాజకీయ విశ్లేషకులు. కానీ అవేవీ పట్టించుకోకుండా హాయిగా తన సినిమాలు తను చేసుకుంటూ కాలం గడిపేస్తున్నాడు సూపర్ స్టార్. అందుకే ఇప్పుడు అభిమానులు కూడా ఆయనపై ఒకింత గుర్రుగా ఉన్నారు.

అక్కడ కమల్ హాసన్ పార్టీ పనులను వేగంగా జరుపుతున్నారు.. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తాను పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు.. కానీ ఇక్క‌డ ర‌జినీకాంత్ మాత్రం అవేం పట్టించుకోకుండా వరకు సినిమాలు చేస్తున్నాడు. ఇంతకీ రజనీకాంత్ కు రాజకీయాల్లోకి పూర్తిగా వ‌చ్చే ఉద్ధేశ్యం ఉందో లేదో అని క‌న్ఫ్యూజ‌న్ లో ఉన్నారు అభిమానులు. వస్తానంటాడు కానీ సినిమాలు చేస్తారు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక అభిమానులు బుర్ర‌లు వేడెక్కిపోతున్నాయి. మరి దీనికి సూపర్ స్టార్ ఎలాంటి సమాధానం చెబుతాడో చూడాలి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here