పేట‌కు ఎంత క‌ష్టం వ‌చ్చిందో.. ర‌జినీకాంత్ అన్ని కోట్లు తెస్తాడా..?

రజినీకాంత్ 20 కోట్లు తీసుకొస్తాడా.. ఒకప్పుడు ఈయన సినిమాలకు 20 కోట్లు అంటే అసలు లెక్క కూడా కాదు.. కానీ ఇప్పుడు అదే లెక్క. ఎందుకంటే గత కొన్నేళ్లుగా రజనీకాంత్ సినిమాలు కనీసం పది కోట్లు కూడా అందుకోవడం లేదు తెలుగులో. కబాలి సినిమా అంత హైప్ ఉండి కూడా కేవలం 18 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అందులో తొలిరోజు వ‌చ్చిన క‌లెక్ష‌న్లే 10 కోట్లు ఉన్నాయి. ఇక ఆ త‌ర్వాత వ‌చ్చిన సినిమాలు మ‌రీ దారుణంగా పోయాయి. కాలా అయితే 10 కోట్ల మార్క్ కూడా అందుకోలేదు. 2.0 సినిమా 50 కోట్లు వసూలు చేసిన కూడా ఆ సినిమాపై ఉన్న అంచనాలు వేరు. మిగిలిన సినిమాలతో దాన్ని పోల్చ‌డం స‌రికాదు. ఇక ఇప్పుడు రజనీకాంత్ నటిస్తున్న పేట సినిమాపై అంచనాలు చాలా తక్కువగా ఉన్నాయి.

Will Superstar Petta Movie not release for sankranthi

ఈ చిత్రం హక్కులను అశోక్ వల్లభనేని 21 కోట్లకు సొంతం చేసుకున్నాడు. ముందు కేవలం 15 కోట్లు మాత్రమే పేట రైట్స్ వెళ్లాయ‌నే వార్త‌లు వినిపించినా కూడా చివ‌రికి అవి 21 కోట్లు అని తేలింది. అయితే ఇప్పుడు ఇన్ని కోట్లు వెనక్కి వస్తాయా అనేది అనుమానంగా మారింది. సంక్రాంతికి పేట తో పాటు మరో మూడు భారీ సినిమాలు విడుదల అవుతున్నాయి. దాంతో రజనీకాంత్ సినిమా ఎంత వసూలు చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు. పదేళ్ల కింద రోబో సినిమాతో 40 కోట్లు వసూలు చేసిన రజనీకాంత్ కు ఇప్పుడు ఇరవై కోట్లు కష్టం గా మారడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా జనవరి 10న తెలుగు తమిళ ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి పేట ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో అనేది చూడాలిక‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here