ర‌జినీకాంత్ సినిమాకు అల్లుడు అదిరిపోయే బీట్..

అదేంటి.. ర‌జినీకాంత్ సినిమాకు అల్లుడు కొట్ట‌డం ఏంటి అనుకుంటున్నారా..? అల్లుడు అంటే ఇక్క‌డ ధ‌నుష్ మాత్రం కాదు. ఈయ‌న పిల్ల‌నిచ్చిన అల్లుడు. కానీ ఈయ‌న‌కు మ‌రో అల్లుడు కూడా ఉన్నాడు. అత‌డే మేన‌ల్లుడు.. అనిరుధ్ ర‌విచంద్ర‌. అవును.. ఇది చాలా మంది తెలియ‌ని విష‌యం. అనిరుధ్ ర‌విచంద్ర స్వ‌యానా ర‌జినీకాంత్ కు అల్లుడు అవుతాడు. ర‌జినీ భార్య ల‌త వాళ్ల అన్న‌య్య కొడుకు అనిరుధ్. బ్యాగ్రౌండ్ ఉండే వ‌చ్చాడు ఈ ఇండ‌స్ట్రీకి.
Rajinikanth Maran Making Video
Rajinikanth Maran Making Video
త‌మ్ముడు అవుతాడు కాబ‌ట్టే ముందు నుంచి అనిరుధ్ ను వెన్నెంటే ఉండి ప్రోత్స‌హించాడు ధ‌నుష్. ఆయ‌నే వ‌ర‌స సినిమాలు ఇచ్చి ఈ రోజు అనిరుధ్ ను నెంబ‌ర్ వ‌న్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా మార్చాడు ధ‌నుష్. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్ని సినిమాలు చేసినా.. అనిరుధ్ కు మాత్రం ర‌జినీ కాంత్ సినిమాకు ప‌ని చేయ‌లేద‌నే కోరిక మిగిలిపోయింది.
ఇప్పుడు ఆ కోరిక‌ను కార్తిక్ సుబ్బ‌రాజ్ తీర్చేస్తున్నాడు. ఈయ‌న‌తో ర‌జినీ చేస్తున్న పేట్ట‌కు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలోని తొలిపాట డిసెంబ‌ర్ 3న విడుద‌ల కానుంది. ఇప్పుడు చిన్న బీట్ ఒక‌టి విడుద‌ల చేసాడు ఈ కుర్ర సంగీత ద‌ర్శ‌కుడు. ఇది విన్న త‌ర్వాత డాన్సులు రానివాళ్లు కూడా ఒక్క‌సారి అలా స్టెప్ వేయ‌కుండా ఉండ‌లేరు. అంత‌గా త‌న బీట్ తో మాయ చేసాడు అనిరుధ్. ముఖ్యంగా అంతా మాస్ బీట్స్ తీసుకొచ్చి ర‌చ్చ ర‌చ్చ చేసాడు అనిరుధ్. ఈ పాట‌లో కానీ ర‌జినీకాంత్ ను చూస్తే అమ్మో ఫ్యాన్స్ ఇంక ఊరుకోగ‌ల‌రా.. థియేట‌ర్స్ లోనే డాన్సులు చేస్తారు. స‌న్ పిక్చ‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతికి సినిమా విడుద‌ల కానుంది. మొత్తానికి ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన ఏడేళ్ళ త‌ర్వాత మావ‌య్య సినిమాకు ప‌నిచేసే అవ‌కాశాన్ని అందుకున్నాడు అనిరుధ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here