పేట సినిమా సేఫ్ అవుతుందా.. ర‌జినీ హిట్ కొడ‌తాడా..?

రజనీకాంత్ ను నమ్ముకొని డిస్ట్రిబ్యూటర్లు మరోసారి మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్నారా.. ఏమో ఇప్పుడు పేట సినిమా కలెక్షన్లు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఈ సినిమాకు 5 రోజుల్లో కేవలం 54 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. తెలుగులో అయితే సినిమా డిజాస్టర్. ఇక్కడ ఐదు రోజులకు కేవలం నాలుగు కోట్లు షేర్ మాత్రమే తీసుకొచ్చింది పేట. దాంతో డిస్ట్రిబ్యూటర్లకు ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. మరోవైపు తమిళనాట కూడా సినిమా ఊహించిన వసూలు తీసుకు రావడంలో విఫలం అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు అక్కడ ఐదు రోజుల్లో కేవలం 22 కోట్లు మాత్రమే వసూలు చేసింది ఈ చిత్రం.

Rajinikanth Petta USA Schedules Theaters List
అజిత్ విశ్వాసం పోటీగా ఉండటంతో అనుకున్న కలెక్షన్లు సాధించడంలో వెనకబడింది పేట. మరో 70 కోట్లు వస్తేగానీ సేఫ్ కాదు పేట‌. దాంతో అన్ని కోట్లు తీసుకొస్తుందా లేదా అనే అనుమానాలు ఇప్పుడు అందరిలోనూ కనిపిస్తున్నాయి. డిస్ట్రిబ్యూటర్లు కూడా సినిమాకు వస్తున్న కలెక్షన్లు చూసి భయపడుతున్నారు. ఇప్పటికే కబాలి, కాలా, 2.0 సినిమాల నుంచి బాగానే నష్టపోయిన బయ్యర్లకు ఇప్పుడు పేట కూడా షాక్ ఇస్తే అంత కంటే దారుణం మరొకటి ఉండదు. దాంతో ఇప్పుడు రజినీకాంత్ సినిమా ఏం చేస్తుందని అంచనాలు ఆసక్తి అంద‌ర్లోనూ కనిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *