పేట సెన్సార్ పూర్తి.. ర‌జినీ ఫ్యాన్స్ కు పండ‌గే..

విడుదలకు 20 రోజుల ముందే అభిమానులకు శుభవార్త చెప్పాడు ర‌జినీకాంత్. ఈయన నటిస్తున్న పేట సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. పక్కా మాస్ మసాలా యాక్ష‌న్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన‌ పేటకు యు బై ఎ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. రజినీకాంత్ ఇమేజ్ బ్యాలెన్స్ చేసుకుంటూ కార్తీక్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఆయన ఇమేజ్ కు ఓ ట్రిబ్యూట్ గా భావిస్తున్నాడు కార్తిక్. కచ్చితంగా ఇది అభిమానులను అలరించడమే కాదు చొక్కాలు చించుకునేలా ఉంటుందని ధీమాగా చెబుతున్నారు కార్తీక్ సుబ్బరాజ్. విడుదలకు ముందు తాను ఎక్కువ విషయాలు చెప్పలేనని సంక్రాంతికి సినిమా చూసిన తర్వాత మీరే తెలుసుకుంటారని నమ్మకంగా చెబుతున్నాడు కార్తీక్. ఈయన కాన్ఫిడెన్స్ చూస్తుంటే నిజంగానే పేట సినిమా సంచలనం సృష్టించేలా కనిపిస్తుంది. అసలే ఈ మధ్య వరుస పరాజయాలతో రజనీ కెరీర్ దారుణంగా ప‌డిపోయింది.

petta censored
petta censored

ఈయన సినిమాలు ఆపేసి రాజకీయాల్లో బిజీ కావడం మంచిదని విశ్లేషకులు కూడా ఉచిత స‌ల‌హాలు ఇస్తున్నారు. ఇలాంటి సమయంలో పేట సినిమాతో వస్తున్నాడు సూపర్ స్టార్. ఇది హిట్ అయితే మళ్లీ రజనీకాంత్ కు తిరుగుండదు. లేదంటే ఇప్పటికే విజయ్ తమిళనాట సంచలనాలు సృష్టిస్తున్నారు.. పేట సినిమా విషయంలో ఏదైనా తేడా జరిగితే ఖచ్చితంగా రజిని నెంబర్ వన్ ప్లేస్ కు కూడా ముప్పు రాక తప్పదు. పైగా సంక్రాంతికి అజిత్ విశ్వాసం సినిమా కూడా విడుదల అవుతుంది. దాంతో పోటీకి సై అంటున్నాడు రజనీకాంత్. ఈ ఇద్దరి మధ్య వార్ ఇప్పుడు బయ్యర్లని వ‌ణికిస్తుంది. సెన్సార్ టాక్ ప్రకారం పేట సినిమాలో కొత్త క‌థేమీ లేదుగానీ రజనీ ఇమేజ్ ను మాత్రం బ్యాలెన్సింగ్ వాడుకొని ఫాన్స్ కు ఫుల్ మీల్స్ సిద్ధం చేశాడని తెలుస్తోంది. ఏదేమైనా రజనీ గత సినిమాలతో పోలిస్తే తక్కువ అంచనాలతోనే వస్తుంది పేట. మరి విడుదల తర్వాతైనా ఈ సినిమా అద్భుతాలు చేస్తుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here