2.0 ఒరిజిన‌ల్ రియాక్ష‌న్స్ ఇలా ఉన్నాయి..

2.0 ట్రైల‌ర్ నిజంగానే అంత బాగా న‌చ్చిందా.. లేదంటే ఏదో మొహమాటినికి బాగుంద‌ని చెబుతున్నారా..? ఇప్పుడు ప‌రిస్థితులు చూస్తుంటే ఇదే అడ‌గాల‌నిపిస్తుంది మ‌రి. ఎందుకంటే 2.0 ట్రైల‌ర్ రియాక్ష‌న్స్ కాస్త ఆల‌స్యంగా బ‌య‌టికి వ‌స్తున్నాయి. ఈ చిత్ర ట్రైల‌ర్ లో విజువ‌ల్ మాత్ర‌మే ఉంది.. విషయం ఎక్క‌డుంది అంటున్నారు ప్రేక్ష‌కులు. కేవ‌లం విజువ‌ల్ ఎఫెక్ట్స్ మాత్రమే న‌మ్మ‌కుంటే ప‌ని జ‌రుగుతుందా అని అడుగుతున్నారు ఆడియ‌న్స్.

2point0

దీనికి శంక‌ర్ అండ్ టీం నుంచి ఇప్పుడు స‌మాధానం శూన్య‌మే అయిపోయింది. ఎందుకంటే ట్రైల‌ర్ లో నిజంగానే అవి త‌ప్ప ఇంకేం క‌నిపించ‌డం లేదు. ర‌జినీకాంత్, అక్ష‌య్ కుమార్ లాంటి సూప‌ర్ స్టార్స్ ఉన్నా కూడా క‌థ కూడా ఉండాలి క‌దా.. అప్పుడే పెట్టిన 500 కోట్ల‌కు కాస్తైనా న్యాయం జ‌రుగుతుంది.. లేదంటే జ‌రిగే న‌ష్టం ఊహ‌కు కూడా అంద‌దు. ఇండియాలోనే భారీ బ‌డ్జెట్ సినిమాగా వ‌స్తున్న 2.0.. ఏదైనా తేడా కొడితే అదే స్థాయిలో చెత్త రికార్డుల‌ను కూడా మూట గ‌ట్టుకోవాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంది. అయితే శంక‌ర్ ద‌ర్శ‌కుడు కావ‌డంతో అభిమానుల్లో సినిమాపై భారీ న‌మ్మ‌కాలే ఉన్నాయి. మొబైల్స్ వాడ‌కం మ‌నిషి బుర్ర‌కు ఎంత ప్ర‌మాదక‌రం అనేది ఈ చిత్రంతో చెబుతున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. క‌చ్చితంగా ఈ సందేశం ప్రేక్ష‌కుల్లోకి బాగా వెళ్తుంద‌ని న‌మ్ముతున్నాడు శంక‌ర్. మొత్తానికి 2.0 ట్రైల‌ర్ రియాక్ష‌న్ మాత్రం మిక్స్ డ్ గానే ఉంది.. మ‌రి న‌వంబ‌ర్ 29న రాబోయే సినిమా ఎలా ఉండ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here