2.0 సినిమా వీకెండ్ ప‌రిస్థితేంటి.. ఎంతొచ్చింది..

ఇప్పుడు అంతా ఇదే అనుకుంటున్నారు. నాలుగు రోజుల త‌ర్వాత ప‌రిస్థితి చూస్తుంటే ఈ చిత్రం ఎలా ముగుస్తుంద‌నేది భ‌యంగా ఉందిప్పుడు. ఎందుకంటే భారీ రేట్ల‌కు కొనడంతో బ‌య్య‌ర్లు ఇప్పుడు వ‌ణికిపోతున్నారు. 4 రోజుల త‌ర్వాత అన్ని ఏరియాల వ‌సూళ్లు చూస్తుంటే ఆశాజ‌న‌కంగా క‌నిపించ‌డం లేదు. తెలుగులో అయితే స్టార్ హీరోల‌కు వ‌చ్చిన రేంజ్ లోనే వ‌సూళ్లు వ‌చ్చాయి కానీ అమ్మిన రేట్ల‌తో పోలిస్తే మాత్రం త‌క్కువే.

Rajini 2 Point 0 Working Stills

4 రోజుల‌కు తెలుగు రాష్ట్రాల్లో 33 కోట్లు షేర్ తీసుకొచ్చింది. ఓవ‌రాల్ వ‌సూళ్లు 35 కోట్లు తీసుకొచ్చింది. తెలుగులో రావాల్సిన మాత్రం 72 కోట్లు. 4వ రోజు 8.24 కోట్లు షేర్ వ‌చ్చింది. ఇది చాలా ఎక్కువ వ‌సూళ్లే కానీ ఇప్పుడు వీక్ డేస్ లోనూ ఈ జోరు కొన‌సాగితేనే 2.0 కాస్తైనా సేఫ్ అవుతుంది. లేదంటే జ‌రిగే న‌ష్టం ఊహ‌కు కూడా అంద‌దు.

2point0 2.0 first weekend boxoffice collections
2point0 2.0 first weekend boxoffice collections

తెలుగుతో పోలిస్తే త‌మిళ‌నాట మ‌రీ త‌క్కువ‌గా వ‌స్తున్నాయి వ‌సూళ్లు. అక్క‌డ నాలుగు రోజుల షేర్ కేవ‌లం 29 కోట్లే. మొత్తానికి రావాల్సింది 100 కోట్లు. దాంతో అనుకున్న దానికంటే చాలా త‌క్కువ వ‌సూళ్లు వ‌స్తున్నాయి అక్క‌డ‌. సౌత్ తో పోలిస్తే నార్త్ లోనే ఎక్కువ వ‌సూళ్లు వ‌స్తున్నాయి.

2.0 2point0 collections box office report

అక్క‌డ నాలుగు రోజులకు 45 కోట్లు షేర్.. 95 కోట్లు గ్రాస్ వ‌చ్చింది. అక్క‌డ సేఫ్ కావాలంటే 77 కోట్లు రావాలి. అంటే ఇంకా 30 కోట్లు రావాలి. కానీ ఇప్పుడు అక్క‌డ ప‌రిస్థితులు చూస్తుంటే అంత ఈజీ కాద‌నిపిస్తుంది. ఓవ‌రాల్ గా ప్ర‌పంచ వ్యాప్తంగా 110 కోట్లు షేర్ తీసుకొచ్చింది. 300 కోట్లు షేర్ వ‌స్తే సినిమా సేఫ్ అవుతుంది. మ‌రి చూడాలిక‌.. 2.0 చివ‌రి వ‌ర‌కు ఏం చేస్తుందో చూడాలిక‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here