2.0 తెలుగు రైట్స్ ఆకాశం.. అద్భుతం చేయాల్సిందే..!

ర‌జినీకాంత్ ను తెలుగు హీరో కాదు.. త‌మిళ హీరో అంటే ఇక్క‌డ కొడ‌తారేమో..? ఎందుకంటే ర‌జినీ యూనివ‌ర్స‌ల్ సూప‌ర్ స్టార్. ఇండియా మొత్తం ఈయ‌నకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే ర‌జినీ సినిమా అంటే అన్ని ఇండ‌స్ట్రీలు ఆస‌క్తిగా చూస్తుంటాయి. ఇప్పుడు 2.0 కూడా దీనికి మిన‌హాయింపేమీ కాదు.

2point0

ఈ సినిమా కూడా ప్రీ రిలీజ్ బిజినెస్ లో రికార్డులు తిర‌గ‌రాస్తుంది. ఏ నిర్మాత‌కైనా 540 కోట్ల‌తో సినిమా నిర్మించిన‌పుడు టెన్ష‌న్ ఉంటుంది. కానీ 2.0 విష‌యంలో మాత్రం అదేం లేదు. ఎందుకంటే అక్క‌డున్న‌ది ర‌జినీకాంత్ క‌దా. ఎన్ని కోట్లు పెట్టినా ముందే బిజినెస్ కూడా అయిపోతుంది. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. 2.0 ప్రీ రిలీజ్ బిజినెస్ 600 కోట్ల‌కు పైగానే జ‌రుగుతుంద‌ని తెలుస్తుంది. త‌మిళ్ లో ఆకాశాన్ని తాకేస్తున్న రేట్లు.. తెలుగులోనూ అలాగే ఉంది.

ఎన్వీఆర్ సినిమాస్ 2.0 హ‌క్కుల్ని భారీ రేట్ కు సొంతం చేసుకున్నారు. అక్క‌డ లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో క‌లిపి ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు ఎన్వీఆర్ సినిమాస్. తెలుగులో కూడా దాదాపు 85 కోట్ల‌కు పైగానే 2.0 బిజినెస్ జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తుంది. కేవ‌లం తెలుగు రాష్ట్రాల్లోనే 72 కోట్ల‌కు ఈ హ‌క్కుల్ని సొంతం చేసుకున్న‌ట్లు తెలుస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు రాష్ట్రాల్లో బాహుబ‌లి 1,2.. ఖైదీ నెం.150.. రంగ‌స్థ‌లం కాకుండా మ‌రే చిత్రం 70 కోట్లు వ‌సూలు చేయలేదు.

ఇప్పుడు ఓ డ‌బ్బింగ్ సినిమా ఈ ఫీట్ చేయ‌డానికి చూస్తుంది. ప‌దేళ్ల కింద రోబోతో 40 కోట్ల మార్క్ అందుకున్నాడు ర‌జినీకాంత్. మ‌రిప్పుడు ర‌జినీ, శంక‌ర్ ఏం చేస్తారో చూడాలిక‌..! న‌వంబ‌ర్ 29న ఈ చిత్రం విడుదల కానుంది. అంతా బాగుంటే ఓకే కానీ ఏదైనా తేడా జిర‌గితే మాత్రం బ‌య్య‌ర్లు భ‌యంక‌రంగా మునిగిపోతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here