హ‌వ్వ‌.. ర‌జినీకాంత్ సినిమా ప‌రిస్థితి అంత దారుణ‌మా..?

రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ కు కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ క‌ల‌లో కూడా అనుకోలేదు అభిమానులు. పేట తెలుగు సినిమా రైట్స్ కేవలం 12 కోట్లకు అమ్ముడయ్యాయనే సంగతి విని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సూప‌ర్ స్టార్ సినిమా అంటే కనీసం 30 కోట్లు పెడతారు బ‌య్య‌ర్లు. కానీ ఇప్పుడు ఆ నమ్మకాలు కనిపించడం లేదు. దానికితోడు సినిమాపై అంచనాలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి.

Rajini Petta Movie Telugu Rights Sold

దీనికి కూడా కారణం లేకపోలేదు.. గత కొన్నేళ్లుగా రజనీకాంత్ సినిమాలు ఊహించినంతగా మెరిపించడం లేదు. అందుకే ఇప్పుడు పేట సినిమాపై ఆ ప్రభావం క‌నిపిస్తుంది. ఈ చిత్ర తెలుగు రైట్స్ కొనడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించలేదు. సంక్రాంతికి మన దగ్గరే మూడు పెద్ద సినిమాలు ఉన్నాయి. దాంతో భారీ రేటు పెట్టడానికి ఆసక్తి చూపించడం లేదు మన డిస్ట్రిబ్యూటర్లు. మరోవైపు తమిళనాట కూడా గత కొన్నేళ్లుగా రజనీకాంత్ సినిమాలకు ఉండే క్రేజ్ గాని.. మార్కెట్ గాని పేట సినిమాకు కనిపించడం లేదు.

కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన పేట జనవరి 11న విడుదల కానుంది. ఇందులో పగటిపూట హాస్టల్ వార్డెన్ గా.. రాత్రిపూట మాఫియా డాన్ గా కనిపిస్తున్నాడు రజనీకాంత్. సిమ్రాన్, త్రిష‌ హీరోయిన్ లుగా న‌టిస్తున్నారు. పూర్తిగా రజనీకాంత్ ఇమేజ్ చుట్టూ కార్తీక్ అల్లుకున్న కథ ఇది. ఈ సినిమా ఫ్యాన్స్ కు ట్రీట్ అని ధీమాగా చెబుతున్నారు ఈ దర్శకుడు. అయితే విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకునే వ‌ర‌కు కూడా రజిని సినిమాను ఇప్పుడు నమ్మే పరిస్థితిలో లేరు డిస్ట్రిబ్యూటర్లు.

తెలుగులో అయితే పేట వస్తున్నట్లు కూడా ప్రేక్షకులకు తెలియదు. ఈయన 2.0 కూడా తెలుగులో నష్టాలు మిగిల్చింది. దాంతో పేట‌ను పట్టించుకునే వారే కరువయ్యారు. డిసెంబర్ 28న ట్రైలర్ విడుదల కానుంది. ఇది వచ్చిన తర్వాత సినిమాపై అంచనాలు పెరుగుతాయని నమ్మకం గా కనిపిస్తున్నారు చిత్రయూనిట్. మరి వాళ్ల నమ్మకాన్ని పేట ట్రైలర్ ఎంతవరకు నిలబెడుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here