2.0 ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చేసాయి.. ఎంతో తెలుసా..?

ఇప్పుడు అంతా దీని గురించే చూస్తున్నారు. వారం రోజుల త‌ర్వాత ప‌రిస్థితి చూస్తుంటే ఈ చిత్రం ఎలా ముగుస్తుంద‌నేది భ‌యంగా ఉందిప్పుడు. ఎందుకంటే భారీ రేట్ల‌కు కొనడంతో బ‌య్య‌ర్లు ఇప్పుడు వ‌ణికిపోతున్నారు. 7 రోజుల త‌ర్వాత అన్ని ఏరియాల వ‌సూళ్లు చూస్తుంటే ఆశాజ‌న‌కంగా క‌నిపించ‌డం లేదు. తెలుగులో అయితే స్టార్ హీరోల‌కు వ‌చ్చిన రేంజ్ లోనే వ‌సూళ్లు వ‌చ్చాయి కానీ అమ్మిన రేట్ల‌తో పోలిస్తే మాత్రం త‌క్కువే. 7 రోజుల‌కు తెలుగు రాష్ట్రాల్లో 40 కోట్లు షేర్ తీసుకొచ్చింది. తెలుగులో రావాల్సిన మాత్రం 72 కోట్లు. 7వ రోజు 2 కోట్లు షేర్ వ‌చ్చింది. ఇది చాలా ఎక్కువ వ‌సూళ్లే కానీ ఇప్పుడు వీక్ డేస్ లోనూ ఈ జోరు కొన‌సాగితేనే 2.0 కాస్తైనా సేఫ్ అవుతుంది. లేదంటే జ‌రిగే న‌ష్టం ఊహ‌కు కూడా అంద‌దు. ఒక్క నైజాంలో మాత్ర‌మే ఈ చిత్రం రికార్డులు సృష్టిస్తుంది.

Rajini 2.0 first week collection

ఇక్క‌డ ఏకంగా వారం రోజుల‌కు 17 కోట్లు వ‌సూలు చేసింది చిత్రం. నాన్ బాహుబ‌లి రికార్డ్ ఇది. రంగ‌స్థలం 16.86 కోట్ల‌తో రికార్డ్ సృష్టిస్తే ఇప్పుడు దాన్ని మించి వ‌సూలు చేసింది ఈ చిత్రం. తెలుగుతో పోలిస్తే త‌మిళ‌నాట మ‌రీ త‌క్కువ‌గా వ‌స్తున్నాయి వ‌సూళ్లు. అక్క‌డ వారం రోజుల షేర్ కేవ‌లం 42 కోట్లే. మొత్తానికి రావాల్సింది 100 కోట్లు. దాంతో అనుకున్న దానికంటే చాలా త‌క్కువ వ‌సూళ్లు వ‌స్తున్నాయి అక్క‌డ‌. సౌత్ తో పోలిస్తే నార్త్ లోనే ఎక్కువ వ‌సూళ్లు వ‌స్తున్నాయి. అక్క‌డ వారం రోజులకు 65 కోట్లు షేర్.. 132 కోట్లు గ్రాస్ వ‌చ్చింది. అక్క‌డ సేఫ్ కావాలంటే 77 కోట్లు రావాలి. అంటే ఇంకా 13 కోట్లు రావాలి. అక్క‌డ ప‌రిస్థితులు చూస్తుంటే సేఫ్ అయ్యేలాగే క‌నిపిస్తుంది. ఓవ‌రాల్ గా ప్ర‌పంచ వ్యాప్తంగా 220 కోట్లు షేర్ తీసుకొచ్చింది. 375 కోట్లు షేర్ వ‌స్తే సినిమా సేఫ్ అవుతుంది. మ‌రి చూడాలిక‌.. 2.0 చివ‌రి వ‌ర‌కు ఏం చేస్తుందో చూడాలిక‌.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *