చిరును భ‌లే వాడేసిన రాజ‌శేఖ‌ర్..

గ‌రుడ‌వేగ సినిమాతో తాను ఇంకా ఉన్నానంటూ ప్రేక్ష‌కులకు గుర్తు చేసాడు రాజ‌శేఖ‌ర్. ఈ చిత్రం 6 కోట్ల వ‌ర‌కు వ‌సూలు చేసింది. ఇప్పుడు క‌నీసం పోస్ట‌ర్ ఖ‌ర్చులు కూడా రావ‌ట్లేదు రాజ‌శేఖ‌ర్ సిన‌మాల‌కు. అలాంటిది ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్ వ‌రకు ర‌ప్పించింది. ప్ర‌వీణ్ స‌త్తార్ తెర‌కెక్కించిన గ‌రుడ‌వేగ‌తో రాజ‌శేఖ‌ర్ కెరీర్ కు మ‌ళ్లీ ఊపిరి వ‌చ్చింది. ఇప్పుడు ఈయ‌న మ‌రో సినిమా చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు.

ప్ర‌స్తుతం త‌న లుక్ పై దృష్టిపెట్టిన రాజ‌శేఖ‌ర్.. త్వ‌ర‌లోనే అ.. సినిమా ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌తో సినిమా చేయ‌బోతున్నాడు. ఈ సినిమా ప్రీ లుక్ ఇప్పుడు విడుద‌లైంది. ఇందులో ఖైదీ నేడే విడుద‌ల అంటూ చివ‌ర్లో పోస్ట‌ర్ ఉంది. చిరంజీవి బ‌ర్త్ డే కానుక‌గా ఈ పోస్ట‌ర్ విడుద‌ల చేయ‌డం గ‌మ‌నార్హం. అస‌లు రాజ‌శేఖ‌ర్, చిరు మ‌ధ్య ఇంత స్నేహం ఎప్పుడొచ్చిందో అర్థం కావ‌డం లేదు ఎవ‌రికీ.

ఈ ఇద్ద‌రి మ‌ధ్య వైరం ఉంద‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే గ‌రుడ‌వేగ టైమ్ లో అంతా సెట్ అయింద‌ని చెప్పాడు రాజ‌శేఖ‌ర్. అందుకే ఇప్పుడు చిరు పుట్టిన‌రోజుకు ఉన్న క్రేజ్ వాడేస్తూ.. త‌న సినిమా పోస్ట‌ర్ విడుద‌ల చేసాడు ఈ సీనియ‌ర్ హీరో. ఇలా అయితే మెగా అభిమానుల అండ‌దండ‌లు కూడా ఈయ‌న‌కు వ‌స్తాయి క‌దా..?

ప‌్ర‌శాంత్ వ‌ర్మ ఇప్పుడు త‌మ‌న్నాతో క్వీన్ ను రీమేక్ చేస్తున్నాడు. నీల‌కంఠ నుంచి క్వీన్ సినిమాను ఈ కుర్ర ద‌ర్శ‌కుడు సొంతం చేసుకున్నాడు. అ.. సినిమా అంద‌రికీ అర్థం కాక‌పోయినా ఈ కుర్రాడికి మాత్రం మంచి పేరు తీసుకొచ్చింది. ఇక ఇప్పుడు రాజ‌శేఖ‌ర్ తో ఈయ‌న ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చేయ‌బోతున్నాడు. ఇప్ప‌టికే క‌థ కూడా పూర్తైంది. ఆగ‌స్ట్ 26న ఫ‌స్ట్ లుక్ ప్ల‌స్ టైటిల్ విడుద‌ల కానుంది. మొత్తానికి చిరంజీవిని మాత్రం భ‌లే వాడుకున్నాడు రాజ‌శేఖ‌ర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here