మ‌ళ్లీ అదే అంటే ఎలా రాజ‌శేఖ‌రా..?

గ‌రుడ‌వేగ సినిమాతో తాను ఇంకా ఉన్నానంటూ ప్రేక్ష‌కులకు గుర్తు చేసాడు రాజ‌శేఖ‌ర్. ఈ చిత్రం 6 కోట్ల వ‌ర‌కు వ‌సూలు చేసింది. ఇప్పుడు క‌నీసం పోస్ట‌ర్ ఖ‌ర్చులు కూడా రావ‌ట్లేదు రాజ‌శేఖ‌ర్ సిన‌మాల‌కు. అలాంటిది ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్ వ‌రకు ర‌ప్పించింది.

ప్ర‌వీణ్ స‌త్తార్ తెర‌కెక్కించిన గ‌రుడ‌వేగ‌తో రాజ‌శేఖ‌ర్ కెరీర్ కు మ‌ళ్లీ ఊపిరి వ‌చ్చింది. ఇప్పుడు ఈయ‌న మ‌రో సినిమా చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు. ప్ర‌స్తుతం త‌న లుక్ పై దృష్టిపెట్టిన రాజ‌శేఖ‌ర్.. ఇప్పుడు అ.. సినిమా ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌తో సినిమా చేస్తున్నాడు.

క‌ల్కి టైటిల్ తో వ‌స్తున్న ఈ చిత్రం 1983 తెలంగాణ నేప‌థ్యంలో తెర‌కెక్క‌బోతుంది. ఇక్క‌డే ప్ర‌త్యేకంగా సినిమాకు సంబంధించిన సెట్ కూడా వేయ‌బోతున్నారు టీం. దీనిక‌సం క‌నీసం 4 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు చేస్తున్నారు. గ‌రుడ‌వేగ సినిమా బాగున్నా కూడా డ‌బ్బులు ఎందుకు రాలేదంటే భారీ బ‌డ్జెట్టే కార‌ణం. మ‌రోసారి ఇప్పుడు ఇదే త‌ప్పు చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఇప్పుడు కూడా క‌నీసం 15 కోట్ల‌తో క‌ల్కి సినిమా తెర‌కెక్క‌నుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదే కానీ నిజం అయితే రాజ‌శేఖ‌ర్ మ‌రోసారి జూదం ఆడుతున్న‌ట్లే.

ప్ర‌శాంత్ వ‌ర్మ ప్ర‌స్తుతం త‌మ‌న్నాతో క్వీన్ రీమేక్ చేస్తున్నాడు. నీల‌కంఠ నుంచి క్వీన్ సినిమాను ఈ కుర్ర ద‌ర్శ‌కుడు సొంతం చేసుకున్నాడు. అ.. సినిమా అంద‌రికీ అర్థం కాక‌పోయినా ఈ కుర్రాడికి మాత్రం మంచి పేరు తీసుకొచ్చింది. ఇక ఇప్పుడు రాజ‌శేఖ‌ర్ తో ఈయ‌న ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చేస్తున్నాడు. క‌ల్కి క‌థ ఇప్ప‌టికే సిద్ధం చేసాడు ఈ ద‌ర్శ‌కుడు. మొత్తానికి ఈ కాంబినేష‌న్ లో ఎలాంటి సినిమా వ‌స్తుందో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here