కొడుకు పెళ్లిలో రాజ‌మౌళి ర‌చ్చ‌.. డాన్సుల‌తో హ‌ల్ చ‌ల్..

కొడుకు పెళ్లి లో మామూలు రచ్చ‌ చేయలేదు రాజమౌళి. ఆయనతోపాటు కుటుంబమంతా కార్తికేయ పెళ్లిని ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేసుకున్నారు. వాళ్ళ‌తో పాటు ఇండస్ట్రీ కూడా ఉంది. జైపూర్లో ఈ పెళ్లి వేడుకలు ఆకాశాన్ని అంటేలా జరుగుతున్నాయి. డిసెంబర్ 29న జరిగిన సంగీత్ లో రాజమౌళి వేసిన డాన్సులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. భార్య రమా రాజమౌళితో కలిసి ఈయన స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇరగదీసాడు.

Rajamouli Super Dance at karthikeya Wedding Celebration

ఆ స్టెప్పులు చూసి అంతా షాక్ అయిపోయారు. రాజమౌళి లో ఇంత మంచి డాన్సర్ ఉన్నాడా అంటూ పొగిడేస్తున్నారు. చాలా రోజుల తర్వాత రాజమౌళి కుటుంబంలో జరుగుతున్న వేడుక కావడంతో అంతా కలిసి పండగ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ ఈ వేడుకలో పాల్గొని సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక మన హీరోలు రామ్ చరణ్, ప్రభాస్, తారక్ కూడా వాళ్ళతో పాటలు డాన్సులు చేస్తూ సరదాగా గడుపుతున్నారు.

డిసెంబర్ 30న కార్తికేయ పెళ్లి జరగనుంది. జనవరి 3న రామోజీ ఫిలిం సిటీలో రిసెప్షన్ జరగనుంది. దీనికి సినీ రాజకీయ ప్రముఖులు భారీగా హాజరు కానున్నారు. పెళ్లికి బాలీవుడ్ ప్రముఖులు కూడా రానున్నారు. మొత్తానికి ఇప్పుడు కార్తికేయ పెళ్లి తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here