రామ్ చ‌ర‌ణ్ కోసం క‌దిలొస్తున్న ఎన్టీఆర్, రాజ‌మౌళి..

రామ్ చ‌ర‌ణ్ అంటే ఏడాది కింది వ‌ర‌కు ఉన్న అభిప్రాయం వేరు.. ఇప్పుడు వేరు. రంగ‌స్థ‌లంకు ముందు వ‌ర‌కు ఆయ‌న మెగాస్టార్ కొడుకే. ప‌దేళ్లైనా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు సొంత గుర్తింపు లేని హీరో. న‌టుడిగా ఏ మాత్రం ఎదుగుద‌ల లేదు అని విమ‌ర్శలు ఎదుర్కొన్న హీరో. కానీ ఒక్క సినిమాతో అంద‌రికీ స‌మాధానం చెప్పాడు రామ్ చ‌ర‌ణ్. రంగ‌స్థ‌లంలో చిట్టిబాబు ఆయ‌న చేసిన ప‌ర్ఫార్మెన్స్ ఎక్క‌డో కూర్చోబెట్టింది.

rajamouli ram charan ntr rrr movie heroines

రాజ‌మౌళి కూడా త‌న‌తో మ‌రో సినిమా చేసేలా చేసింది. ఇప్పుడు ఈయ‌న ఆర్ఆర్ఆర్ తో బిజీగా ఉన్నాడు. అయితే దాంతోపాటే బోయ‌పాటి శీను ద‌ర్శ‌క‌త్వంలో ‘వినయ విధేయ రామ’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ పూర్త‌యింది. జ‌న‌వ‌రిలో సంక్రాంతి కానుక‌గా సినిమా విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ కూడా అదిరిపోయింది. పాట‌ల‌కు మంచి రెస్పాన్సే వ‌స్తుంది.

ram charan vvr song
ram charan vvr song

బిజినెస్ కూడా 80 కోట్ల‌కు పైగానే జ‌రుగుతుంది. కైరా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. దీనికి ఎప్ప‌ట్లాగే చిరంజీవితో పాటు ఆర్ఆర్ఆర్ టీం కూడా వ‌స్తున్నారు. ఒక ఆర్ ఆల్రెడీ అక్క‌డే ఉంటాడు.. మ‌రో ఇద్ద‌రు ఆర్ లు కూడా ఈ వేడుక‌కు రానున్నారు. అంటే రామారావు.. రామ‌జౌళి అన్న‌మాట‌. చ‌ర‌ణ్ కోసం రాజ‌మౌళితో పాటు ఎన్టీఆర్ కూడా ఈ వేడుక‌కు వ‌చ్చి విషెస్ చెప్ప‌నున్నారు. త్వ‌ర‌లోనే ఈ డేట్ కూడా అనౌన్స్ చేయ‌బోతున్నారు. సంక్రాంతికి రాబోయే విన‌య విధేయ రామ క‌చ్చితంగా బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌డం ఖాయం అంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. మ‌రి చూడాలిక‌.. రంగ‌స్థ‌లం ఎఫెక్ట్ ఈ చిత్రంపై ఎంత‌వ‌ర‌కు ఉండ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here