రాజ‌మౌళి సినిమాలో ఫారెన్ హీరోయిన్..

రాజ‌మౌళి మెల్ల‌గా త‌న త‌ర్వాతి సినిమాపై దృష్టి పెంచుతున్నాడు. ఇన్ని రోజులు ఈ సినిమా 2019లో మొద‌ల‌వుతుంది అనుకున్నారు కానీ న‌వంబ‌ర్ లోనే మొద‌లు పెడుతున్నాడు రాజ‌మౌళి. అనుకున్న దానికంటే ముందుగానే సినిమా ప‌ట్టాలెక్క‌నుంది. ఓవైపు కొడుకు కార్తికేయ పెళ్లి ప‌నుల‌తో బిజీగా ఉన్న ఈ ద‌ర్శ‌కుడు.. ఇప్పుడు మ‌ల్టీస్టార‌ర్ పై కూడా క‌న్నేస్తున్నాడు. అయినా రాజ‌మౌళి సినిమా అంటే ఇండియ‌న్ వైడ్ ట్రెండింగ్ ఇప్పుడు.

rrr-movie

బాహుబ‌లి ప్ర‌భావం అలా ఉంది ఏం చేస్తాం మ‌రి..! ప్ర‌స్తుతం చ‌ర‌ణ్, ఎన్టీఆర్ తో మ‌ల్టీస్టార‌ర్ చేస్తున్నాడు రాజ‌మౌళి. ఈ చిత్ర క‌థ విష‌యంలో కూడా చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు ద‌ర్శ‌క‌ధీరుడు. ఇద్ద‌రు సూప‌ర్ స్టార్స్ ను క‌ల‌ప‌డం అంటే ఎంత క‌ష్ట‌మో రాజ‌మౌళికి తెలియంది కాదు.. అందుకే వాళ్ల ఇమేజ్ ను బ్యాలెన్స్ చేసేలా ఎక్క‌డా త‌గ్గ‌కుండా క‌థ సిద్ధం చేస్తున్నాడు జ‌క్క‌న్న‌. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయి ఏడాది దాటుతున్నా ఇప్ప‌టి వ‌ర‌కు దీనికి సంబంధించిన ఒక్క న్యూస్ కూడా బ‌య‌టికి చెప్ప‌లేదు రాజ‌మౌళి.

ఇప్పుడు న‌వంబ‌ర్ మొద‌టి వారంలో సినిమా ప‌ట్టాలెక్క‌నుంది.. తొలి షెడ్యూల్ కాస్త త్వ‌ర‌గానే అయిపోతుంద‌ని తెలుస్తుంది. ఇందులో ఒక్క ఇంట‌ర్వెల్ సీన్ కోస‌మే ఏకంగా 45 రోజుల షెడ్యూల్ ప్లాన్ చేసాడు ద‌ర్శ‌క‌ధీరుడు. ఈ చిత్రంలో ఇద్ద‌రు హీరోయిన్లు కావాలి. ఒక‌రు చ‌ర‌ణ్ కు.. మ‌రొక‌రు ఎన్టీఆర్ కు..! అయిఏ ఇప్పుడు మూడో హీరోయిన్ కూడా వ‌చ్చింది. ఫారెన్ నుంచి ఈ భామ దిగుతుంద‌ని తెలుస్తుంది. ముందుగా ఇందులో రాజ‌మౌళి క‌న్ను మ‌హాన‌టిపై ప‌డిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. కీర్తిసురేష్ న‌ట‌న‌కు ఫిదా అయిపోయిన ద‌ర్శ‌క‌ధీరుడు.. త‌న సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా ఈ భామ‌నే ఫైన‌ల్ చేసిన‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

రామ్ చ‌ర‌ణ్ కు జోడీగా ర‌కుల్ ను తీసుకుంటున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. ముందు పూజాహెగ్డేను అనుకున్నా కూడా ఈమె ఉన్న బిజీకీ మ‌రో ఏడాది వ‌ర‌కు డేట్స్ స‌రిగ్గా ఉండ‌వు. ఈమె ఒక్క‌రి వ‌ల్ల షూటింగ్ అప్ సెట్ అవ్వ‌డం రాజ‌మౌళికి ఇష్టం లేదు. అందుకే ఇప్ప‌టికే రెండు సినిమాల్లో క‌లిసి న‌టించిన చ‌ర‌ణ్, ర‌కుల్ జోడీని కొన‌సాగిస్తున్నాడు ద‌ర్శ‌క‌ధీరుడు. మ‌రో హీరోయిన్ మాత్రం ఫారెన్ నుంచి రానుంది. కీర‌వాణి సంగీతం అందించ‌నున్న ఈ చిత్రాన్ని దాన‌య్య 300 కోట్ల‌తో నిర్మించబోతున్నాడు. 2020లో సినిమా విడుద‌ల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here