బాహుబ‌లి హీరోల‌కు క్లారిటీ ఉండ‌దు.. రాజ‌మౌళి సంచ‌ల‌నం..

బాలీవుడ్ హీరోలకు క్లారిటీ ఉండదు.. అక్కడి హీరోలు ఎలాంటి కథలు చేస్తారో తెలియక వాళ్ళ‌కే తెలియ‌దు.. ఒక్కోసారి అదే కన్ఫ్యూజన్లో ఉంటారు. ఈ కామెంట్స్ చేసింది ఎవరో కాదు దర్శకధీరుడు రాజమౌళి.. ఆయ‌న‌కు ఏం అవసరం వచ్చింది ఇలాంటి కామెంట్స్ చేయ‌డానికి అనుకుంటున్నారా..?

Rajamouli comments on Bollywood Heroes

తాజాగా కాఫీ విత్ కరణ్ షో కి వెళ్ళిన రాజమౌళి అక్కడ చాలా విషయాలు చెప్పాడు. అందులో భాగంగానే రాపిడ్ ఫైర్ లో కరణ్ జోహార్ అడిగిన ఓ ప్రశ్నకు ఇలా సమాధానం చెప్పాడు జ‌క్క‌న‌. బాలీవుడ్ హీరోలకు, మీ దక్షిణాది హీరోలకు మ‌ధ్య మీరు గమనించిన తేడాలేంటీ అని అడిగితే రాజ‌మౌళి ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానం చెప్పాడు.

సౌత్ హీరోలకు ఎలాంటి కథలు చేయాలి.. అభిమానుల‌ను ఎలా మెప్పించాలి అనే ఒక టెన్షన్ ఉంటుందని.. కానీ అది బాలీవుడ్ హీరోల్లో తనకు అది కనిపించలేదని చెప్పాడు రాజమౌళి. దక్షిణాదిన ఎప్పుడూ ఫాన్స్ కోసమే సినిమాలు చేసే హీరోలు ఉంటారని.. కానీ బాలీవుడ్లో మాత్రం తమ కోసం సినిమాలు చేస్తార‌ని చెప్పాడు ఈ దర్శకుడు. వాళ్లకు అప్పుడప్పుడు ఎలాంటి కథలు చేయాలో కూడా క్లారిటీ ఉండదని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు రాజమౌళి. దీనికి క‌ర‌ణ్ జోహార్ కూడా అవును అన్నట్లు తల ఊపాడు. మొత్తానికి రాజమౌళి చేసిన ఈ హాట్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here