క‌న్ఫ‌ర్మ్ అయిన పూరీ జ‌గ‌న్నాథ్, రామ్ సినిమా..

ఎట్టకేలకు పూరి జగన్నాథ్ సినిమా కన్ఫర్మ్ అయింది. మెహబూబా తర్వాత ఆరు నెలలుగా ఖాళీగానే ఉన్న ఈ దర్శకుడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో కొత్త సినిమా ప్ర‌క‌టించాడు. క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమా గురించి అఫీషియల్ గా చెప్పాడు పూరి జగన్నాథ్. ఈ కాంబినేషన్ గురించి కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో చర్చ జరుగుతూనే ఉంది.

Puri jagannadh next movie with ram

ఇప్పుడు పూరి కూడా ఇదే చెప్పాడు. పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా పూరీ, రామ్ సినిమా రాబోతుంది. ఈ సినిమా కోసం కొత్త లుక్ లో కనిపించబోతున్నాడు రామ్. వరస ఫ్లాపుల్లో ఉన్న పూరి జగన్నాథ్ కు రామ్ సినిమా కీలకంగా మారింది. మరోవైపు రామ్ కూడా హలో గురూ ప్రేమ కోసమే సినిమాతో యావరేజ్ దగ్గర ఆగిపోయాడు.

దాంతో ఇద్దరికీ ఈ సినిమా కీలకంగా మారింది. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టి.. మే 2019లో సినిమాను విడుదల చేయాలని చూస్తున్నాడు పూరి జగన్నాథ్. ఈ చిత్రాన్ని తన సొంత బ్యాన‌ర్ పూరి కరెక్ట్స్ పై నిర్మించబోతున్నాడు పూరి జగన్నాథ్. దీనికి ఛార్మి కౌర్ కూడా ఓ నిర్మాతే. మరి ఈ కాంబినేషన్లో రాబోయే సినిమా ఎలా ఉండబోతోందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here