18 కోట్లకు బేరం తెగ్గొట్టిన ప్రియాంక చోప్రా..

సాధార‌ణంగా మ‌నం ఫంక్ష‌న్ చేసుకుంటున్న‌పుడు ఫోటోగ్ర‌ఫ‌ర్స్ ను పిలుస్తుంటాం క‌దా.. వాళ్ల‌కు ఇంత అని మాట్లాడి మ‌రీ బేరం తెగ్గొడుతుంటాం. ఇప్పుడు ప్రియాంక చోప్రా కూడా ఇదే చేసింది. కాక‌పోతే ఫ‌స్ట్ సీన్ లో మ‌నం వాళ్ల‌కు ఫోటోలు తీసినందుకు డ‌బ్బులు ఇస్తాం.. కానీ ప్రియాంక చోప్రా సెలెబ్రెటీ.. స్టార్ హీరోయిన్ క‌దా అందుకే ఆమె ఫోటోలు తీసుకుంటున్నందుకు వాళ్లే డ‌బ్బులు ఇవ్వాలి. ఒక‌టి రెండు కాదు.. 18 కోట్లు ఇవ్వాలి. ఇప్పుడు ఇదంతా ఫ్యాష‌న్ అయిపోయింది. సెలెబ్రెటీస్ పెళ్ళిళ్లు పేరంటాల‌కు చాలా డిమాండ్ ఉంటుంది.. దాన్ని క్యాష్ చేసుకుంటూ వాళ్లు కూడా త‌మ ఈవెంట్స్ ను గ్రాండ్ గా ప్లాన్ చేసుకుంటున్నారు.

priyanka chopra nick jones beverly hills house

ఇప్పుడు ప్రియాంక చోప్రా కూడా ఇదే చేసింది. ఈమె త‌న పెళ్లి ఫోటోలు తీసుకునేందుకు ఓ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీక‌కి ప‌ర్మిష‌న్ ఇచ్చింది.. దాని ఖ‌ర్చు అక్ష‌రాలా 18 కోట్లు. ఇప్పుడు వాళ్లు కాకుండా బ‌య‌టి వాళ్లు ప్రియాంక చోప్రా పెళ్లి ఫోటోస్ అస్స‌లు తీయ‌కూడ‌దు.. వాడుకున్నా కూడా కాపీ రైట్ ఇష్యూ అవుతుంది. ఆ మ‌ధ్య సోనమ్‌ కపూర్‌ – ఆహూజాల వెడ్డింగ్‌ ఫొటోషూట్ కూడా ఇలాగే ఓ మ్యాగ‌జైన్ కొనేసింది. ఇప్పుడు ప్రియాంక చోప్రా-నిక్ వివాహం విష‌యంలోనూ ఇదే జ‌రుగుతుంది. డిసెంబ‌ర్ 2న జోధ్ పూర్ లో ఈ వివాహం జ‌ర‌గ‌బోతుంది. కోరుకున్న ప్రియుడితో మూడు రోజుల పెళ్లి చేసుకుంటుంది ప్రియాంక చోప్రా. మ‌రి ఫోటోల‌కే 18 కోట్లు అడిగితే పెళ్లి వీడియో కానీ ఇవ్వాలంటే ఇంకెన్ని కోట్లు అడుగుతుందో ఈ ముద్దుగుమ్మ‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here