ప్రియున్ని విడిచి ఉండ‌లేక‌పోతున్న ప్రియాంక‌..

అవును.. ఇప్పుడు ప్రియాంక చోప్రాను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మ‌రి. లేక‌పోతే మ‌రేంటి.. నిక్ ను నీడ‌లా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. కాబోయే వాడు ఎక్క‌డికి వెళ్తే అక్క‌డ ద‌ర్శ‌న‌మిస్తుంది. త‌న ప్రియున్ని అంటిపెట్టుకుని ఉంటూ ప్ర‌పంచానికి త‌నను తను ప‌రిచ‌యం చేసుకుంటుంది ప్రియాంక చోప్రా.

ఇప్పుడు కూడా కాబోయే భ‌ర్త‌తో క‌లిసి ఫోటోషూట్ చేసింది పిగ్గీచోప్స్. అందులో నిక్ కాళ్ల ద‌గ్గ‌ర కూర్చుని ప‌తిభ‌క్తి చాటుకుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇప్పుడు ప్రియాంక చోప్రా ఇండియ‌న్ అమ్మాయి కాదు. అక్క‌డి వాళ్ల‌ను పెళ్లి చేసుకుంటే అక్క‌డే వెళ్లిపోతుంది క‌దా.. పైగా ప్రియాంక తీరు చూస్తుంటే మ‌ళ్లీ ఇండియాకు వ‌చ్చే ఉద్దేశ్యం కూడా లేన‌ట్లుంది.

ఏడాదిగా డేటింగ్ లో ఉన్న నిక్ తోనే ఇప్పుడు పెళ్లికి సిద్ధ‌మైపోయింది పిగ్గీచోప్స్. త‌న కంటే 11 ఏళ్లు చిన్న‌వాడైన కుర్రాడితోనే ఏడ‌డుగులు వేయాల‌ని నిశ్చ‌యించుకుని ఈ మ‌ధ్యే నిశ్చితార్థం కూడా చేసుకుంది ప్రియాంక చోప్రా. ఇక నిశ్చితార్థానికి ముందే త‌మ బంధం గురించి చెప్పిన ఈ జంట‌.. ఇప్పుడు అయితే అడ్డూ అదుపు లేకుండా తిరిగేస్తున్నారు. ఏ పార్టీకి వెళ్లినా కూడా క‌లిసే వెళ్లి.. క‌లిసే వ‌స్తున్నారు.

తమ 2017 గాలా రెడ్ కార్పెట్ ద‌గ్గ‌రే ఈ ఇద్ద‌రూ తొలిసారి క‌లిసారు.. అక్క‌డే జంటగా మెరిశారు. ఆ త‌ర్వాత డేట్ కు వెళ్లారు. మ‌న‌సులు క‌లిసాయి.. ఇప్పుడు పెళ్లి కూడా చేసుకోవాల‌ని అనుకుంటున్నారు. మొత్తానికి ప్రియున్ని ఒక్క నిమిషం కూడా విడిచి ఉండ‌లేక‌పోతుంది ప్రియాంక చోప్రా. మ‌రి ఈ ప్రేమ‌లు ఇంకెన్ని రోజులు ఇలాగే ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here