ప్రియుడికి బ‌ర్త్ డే ముద్దిచ్చిన ప్రియాంక చోప్రా..

ప్రియాంక చోప్రా ఇండియాను పూర్తిగా మ‌రిచిపోయిన‌ట్లుంది. ఇప్పుడు ఇదే అనిపిస్తుంది కూడా. అన్నీ వ‌దిలేసి హాయిగా కాబోయే వాడితోనే కాపురం చేయ‌డానికి రెడీ అయిపోయిన‌ట్లుంది. కాబోయే వాడు ఎక్క‌డికి వెళ్తే అక్క‌డ ద‌ర్శ‌న‌మిస్తుంది. త‌న ప్రియున్ని అంటిపెట్టుకుని ఉంటూ ప్ర‌పంచానికి త‌నను తను ప‌రిచ‌యం చేసుకుంటుంది ప్రియాంక చోప్రా.

మొన్నీమ‌ధ్యే కాబోయే భ‌ర్త‌తో క‌లిసి ఫోటోషూట్ చేసింది పిగ్గీచోప్స్. ఇప్పుడు ఆయ‌న బ‌ర్త్ డే పార్టీలో పాల్గొంది. అంద‌రూ చూస్తుండ‌గానే కాబోయే వాన్ని కిస్ చేసింది ఈ ముద్దుగుమ్మ‌. నిక్ పాప్ సింగ‌ర్.. ఆయ‌న కార్య‌క్ర‌మం జ‌రుగుతున్న చోటికి వెళ్లి మ‌రీ విష్ చేసింది ఈ భామ‌. అక్క‌కే చాలా సేపు ఉండి ప్రోగ్రామ్ ఎంజాయ్ చేసింది. ఇప్పుడు ప్రియాంక చోప్రా ఇండియ‌న్ అమ్మాయి కాదు.

priyanka chopra nick jones
priyanka chopra nick jones

అక్క‌డి వాళ్ల‌ను పెళ్లి చేసుకుంటే అక్క‌డే వెళ్లిపోతుంది క‌దా.. పైగా ప్రియాంక తీరు చూస్తుంటే మ‌ళ్లీ ఇండియాకు వ‌చ్చే ఉద్దేశ్యం కూడా లేన‌ట్లుంది. ఏడాదిగా డేటింగ్ లో ఉన్న నిక్ తోనే ఇప్పుడు పెళ్లికి సిద్ధ‌మైపోయింది పిగ్గీచోప్స్. త‌న కంటే 11 ఏళ్లు చిన్న‌వాడైన కుర్రాడితోనే ఏడ‌డుగులు వేయాల‌ని నిశ్చ‌యించుకుని ఈ మ‌ధ్యే నిశ్చితార్థం కూడా చేసుకుంది ప్రియాంక చోప్రా. ఇక నిశ్చితార్థానికి ముందే త‌మ బంధం గురించి చెప్పిన ఈ జంట‌.. ఇప్పుడు అయితే అడ్డూ అదుపు లేకుండా తిరిగేస్తున్నారు.

ఏ పార్టీకి వెళ్లినా కూడా క‌లిసే వెళ్లి.. క‌లిసే వ‌స్తున్నారు. తమ 2017 గాలా రెడ్ కార్పెట్ ద‌గ్గ‌రే ఈ ఇద్ద‌రూ తొలిసారి క‌లిసారు.. అక్క‌డే జంటగా మెరిశారు. ఆ త‌ర్వాత డేట్ కు వెళ్లారు. మ‌న‌సులు క‌లిసాయి.. ఇప్పుడు పెళ్లి కూడా చేసుకోవాల‌ని అనుకుంటున్నారు. మొత్తానికి ప్రియున్ని ఒక్క నిమిషం కూడా విడిచి ఉండ‌లేక‌పోతుంది ప్రియాంక చోప్రా. మ‌రి ఈ ప్రేమ‌లు ఇంకెన్ని రోజులు ఇలాగే ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here