ప్రియాంక చోప్రా పెళ్లైపోయిందిగా..

ఇన్నాళ్ల కుమారి కాస్తా ఇప్పుడు శ్రీ‌మతి అయిపోయింది. జోధ్ పూర్ లో ప్రియాంక చోప్రా, నిక్ జోన్స్ ల పెళ్లి అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. ఈ పెళ్ళిలో చాలా ప్ర‌త్యేక‌త‌లే ఉన్నాయి. ముఖ్యంగా పెళ్లికొడుకు నిక్ గుర్రంపై వ‌చ్చి త‌న ప్రేయ‌సిని పెళ్లాడ‌టం ఇక్క‌డ హైలైట్. సినిమాల్లో మాత్ర‌మే చూసే ఈ సీన్ ఇక్క‌డ నిజంగానే జ‌రిగింది. ప్రియాంక చోప్రా కోసం గుర్రం మీద వ‌చ్చాడు నిక్. ఇక ఆయ‌న త‌ర‌ఫు బంధువులు కూడా చేసిన ర‌చ్చ మామ‌లుగా లేదు.

Priyanka chopra and nick jonas tie the knot

ఇండియ‌న్ స్టైల్ లో కాకుండా ముందు క్రిస్టియ‌న్ ప‌ద్ద‌తిలో ప్రియాంక పెళ్లి జ‌రిగింది. అయితే ఇప్పుడు మ‌ళ్లీ హిందు సంప్ర‌దాయ ప్ర‌కారం కూడా పెళ్లి జ‌ర‌గ‌బోతుంది. దీనికోసం భారీ ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఈ వేడుకకు ప్రియాంక బంధువుల కంటే కూడా నిక్ త‌ర‌ఫు వాళ్లే ఎక్కువ‌గా వ‌స్తున్నారు.

అమెరికా నుంచి అంతా ఇక్క‌డ క‌నిపిస్తున్నారు. మ‌న పెళ్లిళ్లు ఎలా ఉంటాయో తెలుసుకోడానికి వాళ్లు ఉత్సాహం చూపిస్తున్నారు. ముఖ్యంగా నిక్ తండ్రి పాల్ కూడా ఇదే చెబుతున్నాడు. హిందూ సంప్ర‌దాయంలో జ‌రిగే పెళ్లి కోసం వేచి చూస్తున్నామ‌ని చెప్పాడు ఈయ‌న‌.

మ‌రోవైపు నిక్ జోన్స్ కూడా ఇండియ‌న్ ట్రెడిష‌న్స్ ను బాగానే ఫాలో అవుతున్నాడు. ప్రియాంక‌తో ప‌రిచ‌యం అయిన నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అంతా ఇండియ‌న్ క‌ల్చ‌ర్ కు త‌గ్గ‌ట్లే ఉన్నాడు ఈ కుర్రాడు. ఇప్పుడు పెళ్లి కూడా ఇక్క‌డి స్టైల్లో చేసుకున్నాడు. డిసెంబ‌ర్ 4న ప్రియాంక చోప్రా విందు వేడుక ముంబైలో జ‌ర‌గ‌నుంది. దానికి భారీగా బాలీవుడ్ ప్ర‌ముఖుల‌తో పాటు రాజ‌కీయ నేత‌లు కూడా రాబోతున్నారు. కొంద‌ర్ని ప్ర‌త్యేకంగా ప్రియాంక చోప్రా వెళ్లి ఆహ్వానించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here