అల్లుడు కోసం అడిగితే ఆస్తులు అడిగిన ప్రియా వారియ‌ర్..

ప్రియా వారియ‌ర్.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. డిజిట‌ల్ యుగంలో ఫోన్ అంద‌రి చేతిలో ఉన్న ఈ స‌మ‌యంలో ఏ చిన్న ప‌ని చేసినా కూడా ప్రపంచం చూస్తుంది. ఇప్పుడు ప‌ల్లె కోయిల పాట‌ల బేబీ ఎంత ఫేమ‌స్ అయిపోయింది ఒక్క పాట‌తో. అలాగే గ‌తేడాది ఒక్కసారి క‌న్ను గొట్టి ఇండియాను ప‌డుకోబెట్టింది ప్రియా వారియ‌ర్. సెలెబ్రెటీస్ కు కూడా ఎంతో క‌ష్ట‌ప‌డితే రాని స్టార్ డమ్.. రాత్రికి రాత్రే తెచ్చుకుంది ఈ భామ‌.

Priya varrier reject kalyan dev

ఈమె కోసం కార్పోరేట్ కంపెనీలు కూడా క్యూ క‌ట్టాయి. నేష‌న‌ల్ యాడ్స్ లోనూ న‌టించింది. ఇక ప్రైవేట్ యాడ్స్ లో కూడా కుమ్మేస్తుంది. అఖిల్ తో క‌లిసి ఈ మధ్యే ఓ యాడ్ చేసింది. ఇప్పుడు సినిమాల్లో కూడా ఈ భామ‌కు వ‌ర‌స‌గా ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. అన్ని ఇండ‌స్ట్రీల నుంచి అడుగుతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఒరు అడార్ ల‌వ్ త‌ర్వాత ఈమె ఏ సినిమాకు ఒప్పుకోలేదు.

ఇలాంటి టైమ్ లో తెలుగు నుంచి ఓ అవ‌కాశం ప్రియా వారియ‌ర్ ను వెతుక్కుంటూ వెళ్లింది. మెగాస్టార్ చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్ దేవ్ రెండో సినిమా కోసం ప్రియా వారియ‌ర్ ను అడిగితే ఏకంగా కోటి రూపాయ‌లు పారితోషికం అడిగింద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇదే నిజం అయితే ప్రియాను త‌ట్టుకోవ‌డం చాలా క‌ష్టం. ఎందుకంటే ఇక్క‌డ స్టార్ హీరోయిన్లు కూడా కోటికి చేర‌డానికి మూడు నాలుగు సినిమాలు.. విజ‌యాలు అందుకున్నారు. కానీ ఒక్క సినిమా కూడా చేయ‌కుండా క‌న్నుగొట్టి కోటి అడిగితే అంత‌కంటే అరాచ‌కం మ‌రోటి లేదు. డిసెంబ‌ర్ లో ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌నుంది. పులివాసు ద‌ర్శ‌కుడు. కొత్త నిర్మాత రిజ్వాన్ నిర్మిస్తున్నాడు. మ‌రి ప్రియా వారియ‌ర్ ను కోటిచ్చి తీసుకొస్తారో లేదంటే మ‌రో హీరోయిన్ వైపు అడుగేస్తారో చూడాలిక‌.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here