ప్రేమ‌క‌థాచిత్రం 2 వ‌చ్చేస్తుంద‌హో..

తెలుగులో హార్ర‌ర్ కామెడీస్ ఎన్నో వ‌చ్చాయి. కానీ అన్నింటికీ ఆధ్యుడు మాత్రం ప్రేమ‌క‌థాచిత్రం. ఈ సినిమా వ‌చ్చిన త‌ర్వాతే తెలుగులో కొత్త ట్రెండ్ మొద‌లైంది. ఆ త‌ర‌హా క‌థ‌లే అంద‌రు రాసుకోవ‌డం మొద‌లుపెట్టారు. 5 ఏళ్ల కింద మారుతి తెర‌కెక్కించిన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యం సాధించింది.

Prema Katha chitram First Look Poster

 

ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 13 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. అంతా చేస్తే ఆ సినిమా బ‌డ్జెట్ కూడా 2 కోట్లు లేదు. సుధీర్ బాబు, నందిత జంట‌గా మారుతి తెర‌కెక్కించిన ఈ చిత్రం ట్రెండ్ సెట్ట‌ర్ గా నిలిచింది. ఇప్పుడు ఇలాంటి సినిమాకు సీక్వెల్ చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఈ సారి మారుతి స‌పోర్ట్ లేకుండానే అన్నీ చేస్తున్నాడు. సుమంత్ అశ్విన్, నందితాశ్వేత‌, సిద్ధీ ఇగ్నాని జంట‌గా న‌టిస్తున్నారు.

హ‌రికిష‌న్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు.. ఇక ప్రేమ‌క‌థాచిత్రాన్ని నిర్మించిన సుద‌ర్శ‌న్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ కూడా చివ‌రి ద‌శ‌కు వ‌చ్చేసింది. ఇప్పుడు మ‌రో లుక్ విడుద‌లైంది ఈ చిత్రానికి సంబంధించి. భ‌యం మ‌ళ్లీ వ‌చ్చేస్తుంది అంటూ క్యాప్ష‌న్ కూడా పెట్టారు. కానీ ఇప్పుడు ప్రేమ‌క‌థాచిత్రం 2 అంటే ఆల్రెడీ ఎన్నో క‌థ‌లు వ‌చ్చేసాయి. అంత‌కంటే కొత్త‌గా ఏం చూపిస్తార‌నేది ఆశ్చ‌ర్యంగా ఉంది. అలా చేయ‌క‌పోతే మ‌రో ఫ్లాప్ కు ముందే రెడీ అయిపోయి ఉండాలేమో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here