గంగ‌లో క‌లిసిన ఇమేజ్.. ప్ర‌దీప్ పెళ్లిచూపులు డిజాస్ట‌ర్

యాంక‌ర్ ప్ర‌దీప్ అంటే తెలియ‌ని వాళ్లుండ‌రు.. ఆయ‌నకు ఉన్న ఇమేజ్ వాడుకోవాల‌ని స్టార్ మా ఏకంగా ఆయ‌నపై ఓ ప్రోగ్రామ్ డిజైన్ చేసారు. పెళ్లి చూపులు అంటూ ఏకంగా ఆయ‌న‌పైనే అంతా షో ప్లాన్ చేసారు. పైగా బిగ్ బాస్ వ‌స్తున్న టైమ్ లో రోజుకు వంద సార్లు ప్రోమోలు కూడా వేసారు. కానీ ఎంత చేసినా.. ఏం చేసినా కూడా ఇప్పుడు ఈ షోకు అస్స‌లు టాక్ రావ‌డం లేదు. రేటింగ్ కూడా చాలా దారుణంగా ఉంద‌ని తెలుస్తుంది.

Pradeep Pellichoopulu a flop show

పైగా ఇన్నేళ్ల నుంచి తెచ్చుకున్న ఇమేజ్ కూడా ఇప్పుడు పోతుంద‌నే వార్త‌లు కూడా వినిపిస్తున్నాయి. ప్ర‌దీప్ ఏంటి.. ఇలాంటి షో ఎందుకు చేస్తున్నాడు.. సుమ కూడా ఎందుకు ఒప్పుకుందంటూ ఇద్ద‌ర‌ని క‌లిపి విమ‌ర్శిస్తున్నారు వాళ్ల అభిమానులే. ఇక ఇప్పుడు ఈ షో ఆపాలంటూ మ‌హిళ‌లే గోల చేస్తున్నారు. ఇందులో అమ్మాయిల మ‌నోభావాలు దెబ్బ‌తినేలా ఉన్నాయ‌ని వాళ్లు ఆరోపిస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటే న‌వంబ‌ర్ 9 తో ఈ షో పూర్తి కానుంద‌ని తెలుస్తుంది. బాలీవుడ్ లో ఇలాంటి స్వ‌యంవ‌రం రాఖీసావంత్.. పాక్ లో వీణామాలిక్ లాంటి వాళ్లు పెట్టుకున్నారు కానీ మ‌న ద‌గ్గ‌ర మాత్రం పెద్ద‌గా సాహ‌సం చేయ‌లేదు. కానీ ప్ర‌దీప్ తో చేసారు. అయితే ఇప్పుడు క‌నీసం రేటింగ్ కూడా లేకుండా ఉండ‌టంతో షో ను వీలైనంత త్వ‌ర‌గా ముగించాల‌ని ప్లాన్ చేస్తున్నారు స్టార్ మా యాజ‌మాన్యం. బిగ్ బాస్ వ‌చ్చిన టైమ్ లో వ‌స్తుండ‌టంతో దానికి రీ ప్లేస్ అవుతుంద‌ని భావించిన వాళ్ల‌కు త‌ల‌నొప్పిగా మారుతుంద‌ని మాత్రం ఊహించ‌లేదు. ఇన్నేళ్ల‌లో ప్ర‌దీప్ హోస్ట్ చేసిన ఏ షోకు కూడా ఇంత నెగిటివ్ టాక్ రాలేదు. కానీ ఇప్పుడు వ‌చ్చింది. అస‌లు ఈ షో ఎందుకు చేస్తున్నారో అంటూ ఛానెల్స్ మార్చేసే ప‌రిస్థితి వ‌చ్చింది. ఇక సుమ‌కు కూడా తొలిసారి త‌న షోతో ఇంత నెగిటివ్ క‌మెంట్స్ అందుకుంది. రేటింగ్స్ కూడా దారుణంగా ఉండ‌టంతో పెళ్లిచూపులు ఫ్యూచ‌ర్ ఇప్పుడు సందిగ్ధంలో ప‌డింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here