ప్ర‌భాస్ 20వ సినిమా ముచ్చ‌ట్లు చెప్పిన ద‌ర్శ‌కుడు..

ప్ర‌భాస్ ఇప్పుడు వ‌ర‌స సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ఏడాదికో సినిమా చేస్తానంటూ ఇచ్చిన మాట నిల‌బెట్టుకోలేక‌పోయినా కూడా ప్ర‌స్తుతం వ‌ర‌స‌గా సినిమాలు అయితే చేస్తున్నాడు. ఇప్పుడు ఈయ‌న న‌టిస్తున్న సినిమాల్లో జరిగేది చెప్తాం.. జ‌ర‌గ‌బోయేది చెప్తాం అంటున్నాడు. అదేంటి.. అలా చెప్పేది కోయ‌దొర‌లు క‌దా..? ఇదే ప‌దాన్ని కాస్త స్టైలిష్ గా చెప్పాలంటే జాత‌కాలు చెప్ప‌డం అంటారు. ఇంగ్లీష్ పామిస్ట్ అంటారు క‌దా.. ఇప్పుడు ఇదే పాత్ర‌లో ప్ర‌భాస్ న‌టించ‌బోతున్నాడ‌ని తెలుస్తుంది.

Prabhas 20 Film updates

ఈయ‌న ఇప్పుడు సాహోతో బిజీగా ఉన్నాడు. ఇది సెట్స్ పై ఉండ‌గానే రాధాకృష్ణ కుమార్ సినిమాకు కూడా ఓకే చెప్పాడు. ఈ సినిమా ఇప్ప‌టికే 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. క‌థ అంతా యూర‌ప్ చుట్టూనే తిర‌నుంది. అక్క‌డే భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు రాధా. అయితే నెల‌ల త‌ర‌బ‌డి అక్క‌డే షూటింగ్ చేయాల్సి రావ‌డంతో మ‌నం అక్క‌డికి వెళ్లేకంటే.. ఆ దేశాన్నే ఇక్క‌డికి తీసుకొస్తే బాగుంటుంది క‌దా అని ఆలోచిస్తున్నాడు ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ కుమార్. ఈ ప్లానింగ్ అంతా సాహో కోసం మాత్రం కాదు. ఆ త‌ర్వాత సినిమా కోసం. జిల్ ఫేమ్ రాదాకృష్ణ‌తో ఈ సినిమా చేస్తున్నాడు ప్ర‌భాస్.

ఎట్టి ప‌రిస్థితుల్లోనూ 2019లో రెండు సినిమాలతో రావాల‌ని చూస్తున్నాడు ప్ర‌భాస్. రాధాకృష్ణ సినిమా యూర‌ప్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతుంది. అక్క‌డే దాదాపు 70 శాతం షూటింగ్ ప్లాన్ చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు. అయితే మేజ‌ర్ పార్ట్ అంతా యూర‌ప్ లోనే షూట్ చేసి.. ప్యాచ్ వ‌ర్కుల కోసం మాత్రం ఇక్క‌డే ఓ సెట్ వేయాల‌ని చూస్తున్నారు. ప్ర‌తీ చిన్న విష‌యానికి యూర‌ప్ అంటే కుద‌ర‌దు. అందుకే ఆ దేశ‌పు సెట్ ను హైద‌రాబాద్ లో వేయాల‌ని చూస్తున్నారు.

ఈ సినిమా ముచ్చ‌ట్ల గురించి చెబుతూ త్వ‌ర‌లోనే మంచి అకేష‌న్ చూసుకుని వివ‌రాల‌న్నీ చెప్తానంటున్నాడు ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ కుమార్. యూర‌ప్ ను త‌ల‌పించేలా భారీ సెట్టింగులు.. రోడ్లు.. క‌ట్ట‌డాలు ఇక్క‌డే వేస్తున్నారు. 6 కోట్ల‌కు పైగా భారీ ఖ‌ర్చుతో ఈ సెట్ నిర్మాణం జ‌ర‌గ‌నుంది. దీనికోసం హాలీవుడ్ నిపుణులు కూడా ప‌ని చేయ‌బోతున్నారు. ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్ గా న‌టించ‌బోతుంది. ఈ సినిమాలో ప్ర‌భాస్ జాత‌కాలు చెప్పేవాడి పాత్ర‌లో న‌టించ‌నున్నాడ‌ని తెలుస్తుంది. 70-80వ ద‌శ‌కంలో ఈ క‌థ న‌డ‌వ‌నుంది. మొత్తానికి చూడాలిక‌.. ప్ర‌భాస్ జాత‌కం ఈ సినిమాతో ఎలా మార‌బోతుందో..?

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here