అరవింద స‌మేతలో ఆ పాట వ‌చ్చేసింది..

అర‌వింద స‌మేత‌లో అంద‌రికీ తెలిసి నాలుగు పాట‌లే ఉన్నాయి. కానీ సినిమాలో ఐదో పాట కూడా ఉంది. అదే ఊరికి ఉత్తార‌న అనే పాట‌. క్లైమాక్స్ లో విల‌న్ ను చంపిన త‌ర్వాత వ‌చ్చే ప‌క్కా సీమ సాంగ్ ఇది. పంచెల్ దాస్ ఈ పాట‌ను రాసారు. సినిమాలో ఆయ‌న కాకుండా లేడీ సింగ‌ర్ తో పాడించాడు థ‌మ‌న్.

ఇప్పుడు ఈయ‌న పాడిన ట్రాక్ కూడా విడుద‌ల చేసారు. త్రివిక్ర‌మ్ తో పాటు థ‌మ‌న్, రాధాకృష్ణ కూడా ద‌గ్గ‌రుండి మ‌రీ ఈ పాట పాడించుకున్నారు. రెండు నిమిషాల పాటు ఉండే ఈ పాట చాలా ఎమోష‌న‌ల్ గా సాగుతుంది. ఓ భ‌ర్త చ‌చ్చిపోతే నీ భ‌ర్తను నేనే చంపాను చూడండి అంటూ చంపిన మ‌నిషి వ‌చ్చి చెప్ప‌డం ఈ పాట సారాంశం.

దాన్ని చాలా బాగా లిరిక్స్ లో చూపించాడు పెంచ‌ల్ దాస్. ఇప్పుడు లిర‌క‌ల్ వీడియో కూడా విడుద‌లైంది. ఇది చూసిన త‌ర్వాత క‌చ్చితంగా సినిమాపై ఆస‌క్తి మ‌రింత పెర‌గ‌డం ఖాయం.

ఇక పాట చివ‌ర్లో త‌మ‌కు బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చినందుకు కృత‌జ్ఞ‌త‌లు అంటూ లైన్స్ వేసారు టీం. మొత్తానికి అర‌వింద స‌మేత దూకుడుకు అంతా దండాలు పెడుతున్నారు ఇప్పుడు. ఐదో రోజు కూడా 4.50 కోట్ల షేర్ తీసుకొచ్చింది ఈ చిత్రం. ఇప్ప‌టికే 75 కోట్ల వ‌ర‌కు ఈ సినిమా షేర్ వ‌చ్చింది. ఇంకా సెల‌వులు ఉన్నాయి కాబ‌ట్టి మ‌రింత దూకుడు ప్ర‌ద‌ర్శించ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here