ప‌వ‌న్ క‌ళ్యాణ్ వాళ్ల‌తో ఇంకా మైత్రి సాగిస్తున్నాడా..?

ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో సినిమా అంటే ఎప్పుడు మొద‌లై.. ఎప్ప‌టికి పూర్త‌వుతుందో తెలియ‌ని ఓ ఫ‌జిల్. ఇన్నాళ్లూ సినిమా ఒప్పుకుంటే ఏదో ఓ టైమ్ లో చేస్తాడులే అనే న‌మ్మ‌కం అయినా ఉండేది. ఇప్పుడు అది కూడా నిర్మాత‌ల్లో క‌నిపించ‌ట్లేదు. అస‌లు ఈయ‌న సినిమాలే మానేసి రాజ‌కీయాల్లో బిజీ అయిపోయాడు. ఇక‌పై సినిమాలు చేయ‌న‌ని ఓపెన్ గానే చెప్పేసాడు ప‌వ‌న్. ఇలాంటి టైంలో ఆయ‌న‌కు ఒక్క క‌మిట్మెంట్ మాత్రం మిగిలిపోయింది.

pawankalyan

అదే మైత్రి మూవీ మేక‌ర్స్ తో సినిమా. ఇప్ప‌టికే అంద‌రికి సెటిల్ చేసిన ఈయ‌న‌.. మైత్రికి మాత్ర‌మే బాకీ ప‌డిపోయాడు. ఆస‌క్తి లేకుండా సినిమాలు చేస్తే ఇలాగే ఉంటుంద‌ని ప‌వ‌న్ కు కూడా ఈ పాటికే అర్థ‌మైన‌ట్లుంది. అజ్ఞాతవాసి, స‌ర్దార్, కాట‌మ‌రాయుడు ఆయ‌న‌కు ఈ విష‌యం బాగా భోద ప‌డేలా చేసాయి. అందుకే సినిమాలు ఇక చాల‌నుకుంటున్నాడు.

ఆయ‌న సినిమాలు చేయ‌న‌ని చెప్పినా కూడా అభిమానులు మాత్రం ఇంకా ఒక్క సినిమా చేస్తే బాగున్ను అనుకుంటున్నారు. పూర్తి స్థాయిగా ప్ర‌జల ముందుకు వెళ్లే ముందు ఒక్క బ్లాక్ బ‌స్ట‌ర్ తో వెళ్తే ఆ కిక్కే వేరంటున్నారు అభిమానులు. మైత్రి మూవీ మేక‌ర్స్ కూడా ఇదే ప్ర‌య‌త్నిస్తుంది. ఐతే ప‌వ‌న్ మాత్రం మ‌న‌సు మార్చుకునేలా క‌నిపించ‌ట్లేదు. ఎన్నిక‌ల త‌ర్వాత సినిమా ఉంటుంద‌ని చెప్పారు మైత్రి మూవీ మేక‌ర్స్. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు తామిచ్చిన 12 కోట్ల అడ్వాన్స్.. వ‌డ్డీతో క‌లిపి 20 అయింద‌ని.. అది తిరిగి రాక‌పోయినా ప‌ర్లేదు కానీ క‌చ్చితంగా ప‌వ‌న్ తో సినిమా మాత్రం చేస్తాం అని చెబుత‌న్నారు మైత్రి మూవీ మేక‌ర్స్.
అస‌లు మైత్రిలో ప‌వ‌న్ చేయాల్సిన సినిమా తెరీ రీమేకే.

కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీ‌నివాస్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ఆ మ‌ధ్య తెలుగులో వ‌చ్చిన వీర‌మ్ ను మ‌ళ్లీ రీమేక్ చేసి దెబ్బ తిన్నాడు ప‌వ‌న్. ఇప్పుడు తెరీ తెలుగులో పోలీసోడుగా వ‌చ్చింది. ప‌వ‌న్ నో అనేస‌రికి మైత్రి మూవీ మేక‌ర్స్ కూడా మ‌రో క‌థ‌పై కూర్చున్నారు. మ‌రి దీనికి ప‌వ‌న్ ఏం అంటాడో.. ఇప్ప‌టికే ఏఎం ర‌త్నంతో సెటిల్మెంట్ చేసుకున్నాడు ప‌వ‌ర్ స్టార్. కానీ మైత్రికి మాత్రం అడ్వాన్స్ ఇవ్వ‌డం కాదు.. క‌చ్చితంగా సినిమానే చేస్తాడ‌ని చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here