ప‌వ‌న్ సినిమా చేస్తున్నాడా.. నిజ‌మెంతో..?

ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో సినిమా అంటే ఎప్పుడు మొద‌లై.. ఎప్ప‌టికి పూర్త‌వుతుందో తెలియ‌ని ఓ ఫ‌జిల్. ఇన్నాళ్లూ సినిమా ఒప్పుకుంటే ఏదో ఓ టైమ్ లో చేస్తాడులే అనే న‌మ్మ‌కం అయినా ఉండేది. ఇప్పుడు అది కూడా నిర్మాత‌ల్లో క‌నిపించ‌ట్లేదు. అస‌లు ఈయ‌న సినిమాలే మానేసి రాజ‌కీయాల్లో బిజీ అయిపోయాడు. ఇక‌పై సినిమాలు చేయ‌న‌ని ఓపెన్ గానే చెప్పేసాడు ప‌వ‌న్. ఇలాంటి టైంలో ఆయ‌న‌కు ఒక్క క‌మిట్మెంట్ మాత్రం మిగిలిపోయింది.

pawankalyan

అదే మైత్రి మూవీ మేక‌ర్స్ తో సినిమా. ఇప్ప‌టికే అంద‌రికి సెటిల్ చేసిన ఈయ‌న‌.. మైత్రికి మాత్ర‌మే బాకీ ప‌డిపోయాడు. ఆస‌క్తి లేకుండా సినిమాలు చేస్తే ఇలాగే ఉంటుంద‌ని ప‌వ‌న్ కు కూడా ఈ పాటికే అర్థ‌మైన‌ట్లుంది. అజ్ఞాతవాసి, స‌ర్దార్, కాట‌మ‌రాయుడు ఆయ‌న‌కు ఈ విష‌యం బాగా భోద ప‌డేలా చేసాయి. అందుకే సినిమాలు ఇక చాల‌నుకుంటున్నాడు. అయితే ఇప్పుడు మాత్రం మ‌ళ్లీ ఈయ‌న బుర్ర సినిమా వైపు వ‌స్తుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఎన్నిక‌ల‌కు ముందే ఓ సినిమా చేయాల‌నుకుంటున్నాడు. అయితే అది మైత్రి మూవీ మేక‌ర్స్ తో మాత్రం కాదు. రామ్ త‌ళ్లూరి నిర్మాత‌గా సినిమా చేయ‌బోతున్నాడు ప‌వ‌ర్ స్టార్. దీనిపై ఇంకా అఫీషియ‌ల్ క‌న్ఫ‌ర్మేష‌న్ రాక‌పోయినా కూడా క‌థ అయితే సిద్ధ‌మ‌వుతుంద‌ని టాక్ వినిపిస్తుంది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఆయ‌న సినిమా చేయ‌డం అనేది చిన్న విష‌యం కాదు. ఓ వైపు ఎన్నిక‌లు ద‌గ్గ‌రికి వ‌స్తుంటే మ‌రోవైపు సినిమాల‌తో బిజీ అయితే ప్ర‌జ‌లు ప‌వ‌న్ ను న‌మ్ముతారా.. న‌మ్మి ఓట్లేస్తారా అనేది ఆస‌క్తిక‌ర‌మే. అయితే ఈయ‌న మాత్రం ఇప్పుడు సినిమా చేయాలనుకోడానికి కార‌ణం కూడా అది పొలిటిక‌ల్ క‌థ కావ‌డం.. అలాంటి క‌థ చేస్తే పార్టీకి కూడా కాస్త ఊపు వ‌స్తుంద‌ని న‌మ్మ‌డం. మ‌రి చూడాలిక‌.. నిజంగానే ప‌వ‌న్ మ‌న‌సు సినిమాల వైపు మ‌ళ్లిందో.. లేదంటే అలా అంటున్నాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here