స‌ర్కార్ కాంట్ర‌వ‌ర్సీపై ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇప్పుడు రాజ‌కీయ నాయ‌కుడే.. సినిమా హీరో అయితే కాదు. ఇప్ప‌ట్లో ఆయ‌న‌కు సినిమాలు చేసే ఉద్దేశ్యం కూడా లేదు. అస‌లు త‌న‌కు 2003లోనే సినిమాలు చేసే మూడ్ పోయింద‌ని.. అయితే అప్పుడు కానీ ఓ హిట్ వ‌చ్చుంటే సినిమాలు వ‌దిలేసేవాన్నేమో కానీ ప‌దేళ్ల పాటు త‌న‌కు హిట్ లేక‌పోవ‌డంతో అభిమానుల కోసం సినిమాలు చేయాల్సి వ‌చ్చింద‌ని చెప్పాడు ఈయ‌న‌. ఇప్పుడు రాజ‌కీయాల్లో బిజీగా ఉన్న ప‌వ‌ర్ స్టార్.. చెన్నైలో ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూ సంచ‌ల‌నంగా మారుతుంది.

pawankalyan

అందులో స‌ర్కార్ సినిమా వివాదం గురించి కూడా ప్ర‌శ్న ఉంది. అలాంటి వాళ్ల‌కు ప‌వ‌న్ అదిరిపోయే స‌మాధానం ఇచ్చాడు. వివాదాలు సృష్టించాల‌నుకునే వాళ్ల‌కు సినిమానే ఎప్పుడూ సాఫ్ట్ టార్గెట్. అలాంటిది సర్కార్ చిత్రాన్ని టార్గెట్ చేయకుండా వాళ్ళు ఊరుకుంటారా.. వాళ్ళ నైజం అంటూ పవన్ చెప్పారు. ముఖ్యంగా స‌ర్కార్ లో ప్ర‌భుత్వం తీరు గురించి ప్ర‌శ్నించిన‌పుడు సాధార‌ణంగా రాజ‌కీయ నాయ‌కుల‌కు కోపం వ‌స్తుంది.. వాళ్లు చేయ‌ని ప‌ని గుర్తు చేస్తే వాళ్ల‌కు మండుతుంద‌ని సెటైర్లు వేసాడు ప‌వ‌న్.

గ‌తంలో త‌న పులి సినిమాను కూడా ఇలాగే చేసార‌ని గుర్తు చేసుకున్నాడు. తెలంగాణ ఉద్యమ సంయమలో వ‌చ్చిన కొమరం పులిలో చిన్న డైలాగ్ తో పెద్ద ర‌చ్చ చేసార‌ని గుర్తు చేసుకున్నాడు. సర్కార్ చిత్రంలో సమస్యలపై పోరాటాన్ని చూపించారు. అలాంటి పోరాటాలు నిజజీవితంలో చేయాలనే రాజకీయాల్లోకి వచ్చినట్లు పవన్ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక సినిమాల్లో న‌టిస్తారా అనే ప్ర‌శ్న‌కు స‌మాధానంగా ఇప్పుడు అయితే లేదు కానీ త‌న‌కు కానీ పార్టీకి కానీ డ‌బ్బు అవసరమైతే సినిమాలు చేసిపెట్టమని నా బంధువులు, స్నేహితుల్లో కొందరిని అడిగానంటూ పవన్ తెలిపాడు. గ‌తంలో ఎంజీఆర్ కూడా రాజకీయాల్లో ఉన్నప్పుడు పార్టీ అవసరాల కోసం సినిమాలు చేసేవారని పవన్ తెలిపాడు. అంటే సినిమాలు చేయ‌డానికి ప‌వ‌న్ సుముఖంగానే ఉన్నాడు కానీ ఇప్పుడు కాదు.. దానికి కూడా స‌మ‌యం రావాలి. అప్ప‌టి వ‌ర‌కు ఈయ‌న రాజ‌కీయ నాయ‌కుడే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here