అదేంటి.. క్రిష్ ఏంటి బ్లాక్ మెయిల్ చేయడమేంటి అనుకుంటున్నారా.?? ఇక్కడ బ్లాక్ మెయిల్ అంటే ఎమోషనల్ గా అని అర్థం. ఇప్పుడు ఈయన ఇందులో ఎంచుకుంటున్న నటులను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మరి. ఎన్టీఆర్ బయోపిక్ చరిత్రలో నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఒక్కో పోస్టర్ విడుదల అవుతుంటే అసలు అభిమానులు ఆగలేకపోతున్నారు. నిజంగానే ప్రాణాలు పోసి అందర్నీ మళ్లీ తెరపై చూపిస్తున్నాడు ఈ దర్శకుడు.
ముఖ్యంగా వారసులనే ఎక్కువగా తీసుకుంటున్నాడు క్రిష్. కళ్యాణ్ రామ్ అచ్చంగా నాన్నలా మారిపోయాడు. ఇక బాలయ్య అయితే ఎప్పుడో ఎన్టీఆర్ అయిపోయాడు. సినిమా అయ్యే సరికి బాలయ్య పూర్తిగా ఎన్టీఆర్ లా మారిపోతాడేమో..? అంతగా మాయ చేస్తున్నాడు క్రిష్. ఇక కళ్యాణ్ రామ్ కూడా చాలా బాగున్నాడు. సినిమాలో హరికృష్ణ పాత్ర కీలకంగా ఉండబోతుందని.. ఆయన ముఖ్యమంత్రి అవ్వడంలో చైతన్య రథం పాత్ర అందరికీ తెలిసిందే.. ఇదే సినిమాలో ఇంకా హైలైట్ అయ్యే విధంగా తెరకెక్కిస్తున్నాడు క్రిష్. పైగా ఇప్పుడు హరికృష్ణ భౌతికంగా లేరు.. దాంతో ఆయన గురించి ఏం చూపించినా కూడా ప్రేక్షకులు ఎమోషనల్ గా కనెక్ల్ అవుతారు.
ఇదే పట్టుకుంటున్నాడు ఇప్పుడు క్రిష్. సుమంత్ అయితే ఏఎన్నార్ లా అచ్చుగుద్దినట్లు సరిపోయాడు. ఆయనకు పెద్దగా మేకప్ ఖర్చు కూడా లేనట్లుంది. ఎందుకంటే చూడ్డానికి కూడా అలాగే ఉంటాడు ఈయన. కాస్త మారిస్తే తాతయ్యలా మారిపోతాడు సుమంత్. క్రిష్ కూడా ఇప్పుడు ఇదే చేసాడు. ఈయన్ని తీసుకోవడంతోనే సగం విజయం సాధించాడు క్రిష్. ఇప్పుడు లుక్ చూసిన తర్వాత విజయం సంపూర్ణం అయింది. ఇక ఇప్పుడు రాఘవేంద్రరావ్ పాత్ర కోసం ఆయన తనయుడు కేస్ ప్రకాశ్ ను తీసుకుంటున్నాడు క్రిష్. అలా చేయడంతో దర్శకేంద్రుడి లుక్ కూడా సరిపోతుందని క్రిష్ అంచనా.
ఎన్టీఆర్ జీవితంలో రాఘవేంద్రరావ్ ఎన్నో అద్భుతమైన సినిమాలు ఇచ్చాడు. బాలయ్యను ఎన్టీఆర్ గా.. సుమంత్ ను ఏఎన్నార్ గా.. కళ్యాణ్ రామ్ ను హరికృష్ణగా.. ఇప్పుడు రాఘవేంద్రరావ్ గా ప్రకాశ్ గా చూపిస్తున్న ఈయన.. సావిత్రిగా నిత్యామీనన్ ను తీసుకుంటున్నాడు. శ్రీదేవిగా రకుల్ ఆడిపాడుతుంది. చంద్రబాబు నాయుడుగా ఇప్పటికే రానా లుక్ అదిరిపోయింది. మొత్తానికి ఈ లుక్స్ తోనే సినిమా రేంజ్ పెంచేస్తున్నాడు క్రిష్. జనవరి 9న కథానాయకుడు.. జనవరి 24న మహానాయకుడు విడుదల కానున్నాయి.