ప‌డిప‌డి లేచే మ‌న‌సు టీజ‌ర్.. సింపుల్ అండ్ బ్యూటీఫుల్..

చాలా రోజులుగా ఆస‌క్తి పుట్టిస్తున్న ప‌డిప‌డి లేచే మ‌న‌సు టీజ‌ర్ వ‌చ్చేసింది. శ‌ర్వానంద్, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని హ‌ను రాఘ‌వ‌పూడి తెర‌కెక్కిస్తున్నాడు. ఎప్ప‌ట్లాగే టీజ‌ర్ లో సాయిప‌ల్ల‌వి చంపేసింది. త‌న క్యూట్ ఎక్స్ ప్రెష‌న్స్ తో మొత్తం లీడ్ తీసుకుంది. శ‌ర్వానంద్ కూడా ఆమెతో పోటీగా ఆక‌ట్టుకున్నాడు. ఈ ఇద్ద‌రి కెమిస్ట్రీ టీజ‌ర్ లో అదిరిపోయింది. అమ్మాయి వెంట ప‌డుతుండ‌టం.. ఎక్క‌డికి వెళ్తే అక్క‌డికి వెళ్ల‌డం.. ఇవ‌న్నీ బాగున్నాయి.

PADI PADI LECHE MANASU

కోల్ క‌త్తా బ్యాక్ డ్రాప్ తో సినిమా సాగుతుంది. ఇందులో డాక్ట‌ర్ గా న‌టిస్తుంది సాయిప‌ల్ల‌వి. అంతేకాదు.. ఇందులో శ‌ర్వానంద్ గ‌తం మ‌ర్చిపోతాడ‌ని తెలుస్తుంది. దానికి క‌థకు కూడా చాలా లింక్ ఉంటుంది. పైగా ఈ చిత్ర క‌థ అంతా బెంగాలీ నేప‌థ్యంలోనే సాగ‌నుంది. ఆర్మీ ఆఫీస‌ర్ గా శ‌ర్వా న‌టిస్తున్నాడ‌ని తెలుస్తుంది. ఈ సినిమాతో మ‌ళ్లీ హిట్ కొట్టాల‌ని చూస్తున్నాడు హ‌ను. లై త‌ర్వాత ఆయ‌న చేస్తున్న సినిమా ఇది.

క‌చ్చితంగా కొడ‌తాన‌ని చెబుతున్నాడు. టీజ‌ర్ చూస్తుంటే కొట్టేలా ఉన్నాడు కూడా. పైగా సాయిప‌ల్ల‌వి కూడా ఉంది. ఈమె న‌టించిన ఫిదా.. ఎంసిఏ రెండూ హిట్టే.. ఇప్పుడు హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తుంది ఈ న్యాచుర‌ల్ బ్యూటీ. మ‌రి చూడాలిక‌.. డిసెంబ‌ర్ 21న వ‌చ్చిన త‌ర్వాత మ‌న‌సు నిజంగానే ప‌డిప‌డి లేస్తుందో లేదో..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *