ప‌డిప‌డి లేచే మ‌న‌సు రైట్స్ సంచ‌ల‌నం..

చాలా రోజులుగా ఆస‌క్తి పుట్టిస్తున్న సినిమా ప‌డిప‌డి లేచే మ‌న‌సు. శ‌ర్వానంద్, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని హ‌ను రాఘ‌వ‌పూడి తెర‌కెక్కిస్తున్నాడు. సాయిప‌ల్ల‌వి ఉండ‌టంతో సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. పైగా శ‌ర్వానంద్ కూడా వ‌ర‌స విజ‌యాల‌తో జోరు మీదున్నాడు. లై లాంటి డిజాస్ట‌ర్ త‌ర్వాత హ‌ను తెర‌కెక్కిస్తున్న సినిమా అయినా కూడా ఆ ప్ర‌భావం మాత్రం ఈ చిత్రంపై ప‌డ్డ‌ట్లు క‌నిపించ‌డం లేదు.

Padi Padi Leche Manasu Movie Satelight Rights Solded

క‌చ్చితంగా హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌కం క‌నిపిస్తుంది. పైగా ఇప్పుడు రైట్స్ విష‌యంలో సినిమా సంచ‌ల‌నం సృష్టించింది. ఒక‌టి రెండు కాదు.. 12 కోట్ల‌కు ఈ చిత్ర డిజిట‌ల్, శాటిలైట్, డ‌బ్బింగ్ రైట్స్ అమ్ముడ‌య్యాయి. సినిమా బ‌డ్జెట్ లో స‌గం రైట్స్ రూపంలోనే వ‌చ్చాయి. సాయిప‌ల్ల‌వి మ‌రోసారి త‌న క్యూట్ ఎక్స్ ప్రెష‌న్స్ తో మొత్తం లీడ్ తీసుకుంది.

శ‌ర్వానంద్ కూడా ఆమెతో పోటీగా ఆక‌ట్టుకున్నాడు. ఈ ఇద్ద‌రి కెమిస్ట్రీ అదిరిపోయింది. హ‌ను మ‌రోసారి త‌న స్టైల్ ఆఫ్ మేకింగ్ తో చంపేసాడు. ఇందులో డాక్ట‌ర్ గా న‌టిస్తుంది సాయిప‌ల్ల‌వి. ఇందులో శ‌ర్వానంద్ గ‌తం మ‌ర్చిపోయే పాత్ర‌లో న‌టిస్తున్నాడ‌ని తెలుస్తుంది. దానికి క‌థకు కూడా చాలా లింక్ ఉంటుంది. పైగా ఈ చిత్ర క‌థ అంతా బెంగాలీ నేప‌థ్యంలోనే సాగ‌నుంది. ఆర్మీ ఆఫీస‌ర్ గా శ‌ర్వా న‌టిస్తున్నాడ‌ని తెలుస్తుంది. ఈ సినిమాతో మ‌ళ్లీ హిట్ కొట్టాల‌ని చూస్తున్నాడు హ‌ను. లై త‌ర్వాత ఆయ‌న చేస్తున్న సినిమా ఇది. క‌చ్చితంగా కొడ‌తాన‌ని చెబుతున్నాడు. సాయిప‌ల్ల‌వి తెలుగులో ఫిదా.. ఎంసిఏ త‌ర్వాత చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాతో హ్యాట్రిక్ పూర్తి చేయాల‌ని చూస్తుంది. మ‌రి చూడాలిక‌.. డిసెంబ‌ర్ 21న వ‌చ్చిన త‌ర్వాత మ‌న‌సు నిజంగానే ప‌డిప‌డి లేస్తుందో లేదో..?

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here