ప‌డిప‌డి లేచె మ‌న‌సు మ‌రో పాట విడుద‌లైంది. విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతం అందించిన ఈ పాట‌ల‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. ముఖ్యంగా కేకే లిరిక్స్ చాలా బాగున్నాయి. దానికి తోడు శ‌ర్వానంద్, సాయిప‌ల్ల‌వి మ‌ధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. పాట‌లు కూడా అద్భుతంగా తెర‌కెక్కిస్తున్నాడు హ‌ను రాఘ‌వ‌పూడి. అయినా కొంద‌రు ద‌ర్శ‌కులు ఫ్లాప్ సినిమాలు చేసినా కూడా ఏదో తెలియ‌ని అంచ‌నాలు ఉంటాయి. అలాంటి ద‌ర్శ‌కుడే హ‌ను రాఘ‌వ‌పూడి కూడా.

ఈయ‌న చేసిన సినిమాల్లో ఒక్క‌టి కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ లేదు. కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ ఒక్క‌టే కాస్త ప‌ర్లేద‌నిపించింది. ఈయ‌న గ‌త సినిమా లై కూడా డిజాస్ట‌రే. అయినా కూడా ఇప్పుడు హ‌ను తెర‌కెక్కిస్తున్న ప‌డిప‌డి లేచే మ‌న‌సుపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. టీజ‌ర్ తోనే సినిమా రేంజ్ ఏంటో చూపించాడు ద‌ర్శ‌కుడు.

అందులో అమ్మాయి వెంట ప‌డుతుండ‌టం.. ఎక్క‌డికి వెళ్తే అక్క‌డికి వెళ్ల‌డం.. ఇవ‌న్నీ బాగున్నాయి. కోల్ క‌త్తా బ్యాక్ డ్రాప్ తో సినిమా సాగుతుంది. ఇందులో డాక్ట‌ర్ గా న‌టిస్తుంది సాయిప‌ల్ల‌వి. అంతేకాదు.. ఇందులో శ‌ర్వానంద్ గ‌తం మ‌ర్చిపోతాడ‌ని తెలుస్తుంది. దానికి క‌థకు కూడా చాలా లింక్ ఉంటుంది. పైగా ఈ చిత్ర క‌థ అంతా బెంగాలీ నేప‌థ్యంలోనే సాగ‌నుంది. ఆర్మీ ఆఫీస‌ర్ గా శ‌ర్వా న‌టిస్తున్నాడ‌ని తెలుస్తుంది. ఈ సినిమాతో మ‌ళ్లీ హిట్ కొట్టాల‌ని చూస్తున్నాడు హ‌ను. లై త‌ర్వాత ఆయ‌న చేస్తున్న సినిమా ఇది. క‌చ్చితంగా కొడ‌తాన‌ని చెబుతున్నాడు. టీజ‌ర్ చూస్తుంటే కొట్టేలా ఉన్నాడు కూడా. పైగా సాయిప‌ల్ల‌వి కూడా ఉంది. ఈమె న‌టించిన ఫిదా.. ఎంసిఏ రెండూ హిట్టే.. ఇప్పుడు హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తుంది ఈ న్యాచుర‌ల్ బ్యూటీ. మ‌రి చూడాలిక‌.. డిసెంబ‌ర్ 21న వ‌చ్చిన త‌ర్వాత మ‌న‌సు నిజంగానే ప‌డిప‌డి లేస్తుందో లేదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here