పా రంజిత్ హిందీ సినిమా.. నువ్వు సూప‌ర్ బాసూ..

కొంద‌రు ద‌ర్శ‌కుల చేతుల్లో ఏదో మంత్ర‌దండం ఉంటుంది. వాళ్లు ఏం చెప్పినా కూడా నిర్మాత‌లు అలా ప‌డిపోతుంటారు. హీరోలు కూడా అంతే. పా రంజిత్ ను చూస్తుంటే ఇప్పుడు ఇదే అనిపిస్తుంది. ఈ ద‌ర్శ‌కుడిలో ఏదో మాయ ఉంది. అయినా ఒక‌డు ఒక‌సారి మోసం చేస్తే అది వాడి త‌ప్పు.. రెండోసారి కూడా మోస‌పోతే అది నీ త‌ప్పు అంటారు. కానీ అదే వ్య‌క్తి మూడో సారి కూడా మోసం చేస్తాడేమో అని తెలిసినా న‌మ్మ‌డం ఎవ‌రి త‌ప్పు అనాలి..? ఇప్పుడు ఈ ద‌ర్శ‌కుడి మాట‌ల‌ను.. చేతల‌ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది.

Pa Ranjith Bollwood Debut

ఇప్పుడు ఈ ద‌ర్శ‌కుడు ఏకంగా బాలీవుడ్ సినిమా ప‌ట్టేసాడు. ఆట్ట‌క‌త్తి, మ‌ద్రాస్ లాంటి సినిమాల‌తో విజ‌యాలు అందుకున్నా కూడా క‌బాలి లాంటి ఫ్లాప్ సినిమాతోనే ప్ర‌పంచానికి ప‌రిచ‌యం అయ్యాడు రంజిత్. ఈ చిత్రం ఫ్లాప్ అయినా కూడా వెంట‌నే కాలాతో మ‌రో అవ‌కాశం ఇచ్చాడు సూప‌ర్ స్టార్. ఓ ప‌క్క ర‌జినీతో సినిమా చేయ‌డానికి ఏళ్ల‌కేళ్లు త‌ప‌స్సు చేస్తున్నారు కొంద‌రు ద‌ర్శ‌కులు.

కానీ రంజిత్ కు రెండుసార్లు ఆ అవ‌కాశం వ‌చ్చింది. అయితే రెండుసార్లు ఈయ‌న అభిమానుల‌ను నిరాశ ప‌రిచాడు. కాలా కూడా క‌మ‌ర్షియ‌ల్ గా డిజాస్ట‌ర్ అయిపోయింది. ఇలాంటి స‌మ‌యంలో ఈయ‌న త్వ‌ర‌లోనే భారీ సినిమా చేయ‌బోతున్నాడు. అది కూడా హిందీలో.. అక్క‌డ ట్రైబ‌ల్ ఫైట‌ర్ బిస్రా ముండా బ‌యోపిక్ చేయ‌బోతున్నాడు రంజిత్. 170 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్క‌బోయే ఈ చిత్రంలో అమీర్ ఖాన్ హీరోగా న‌టిస్తాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. 1900లోనే చ‌నిపోయిన ఈ నాయ‌కుడు.. వెన‌క‌బ‌డిన తెగ‌ల కోసం బ్రిటీష్ వాళ్ళ‌తో పోరాటం చేసాడు.

ఈ బ‌యోపిక్ న‌మాష్ పిక్చ‌ర్స్ సంస్థ‌లో ష‌రీన్ మార్తి, కిషోర్ అరోరా నిర్మించ‌బోతున్నారు. వ‌చ్చే ఏడాది ఈ చిత్రం అఫీషియ‌ల్ గా ఓపెనింగ్ జ‌ర‌గ‌నుంది. ఒక‌వేళ నిజంగానే అమీర్ ఖాన్ కానీ ఈ ప్రాజెక్ట్ లోకి వ‌చ్చాడంటే రంజిత్ జాత‌కం మారిపోయిన‌ట్లే..! మ‌రి ఇప్పుడైనా ఈ కుర్ర ద‌ర్శ‌కుడు చెప్పిన‌ట్లు విజ‌యం సాధిస్తాడో లేదో చూడాలిక‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here