ఘ‌న‌కీర్తిసాంధ్ర విజితాఖిలాంధ్ర మ‌ణిదీప‌కా క‌థానాయకా..

తెలుగులో ఇలాంటి ప‌దాలు కూడా ఉన్నాయా అని ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన ప‌నిలేదు. గొప్ప‌వాళ్ల కోసం గొప్ప‌గొప్ప ప‌దాలు క‌నుక్కోవాలి త‌ప్ప‌దు. ఎక్క‌డ ఉన్నా కూడా వాళ్ల కోసం అంద‌మైన ప‌దాల అమ‌రిక చేయాల్సిందే. ఇప్పుడు ఎన్టీఆర్ లాంటి గొప్ప నాయ‌కుడు.. క‌థానాయ‌కుడు కోసం కీర‌వాణి కూడా ఇదే చేసాడు. ఆయ‌న స్వ‌ర‌సార‌ధ్యంలో విడుద‌లైన ఎన్టీఆర్ టైటిల్ సాంగ్ ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

 

విడుద‌లైన క్ష‌ణం నుంచి సోష‌ల్ మీడియాలో యూ ట్యూబ్ లో సంచ‌ల‌నాలు సృష్టిస్తుంది. గొప్ప క‌థానాయ‌కుడి కోసం ఈ పాట‌ను కీరవాణి తండ్రి శివ‌శ‌క్తిద‌త్తా రచించారు. తెలుగులో ఉన్న అద్భుత‌మైన ప‌దాల‌న్నీ ఓకే చోట చేర్చి ఆ మ‌హానుభావుడికి ప‌ద‌నివాళి అందించాడు. ఘ‌న‌కీర్తిసాంధ్ర విజితాఖిలాంధ్ర జ‌న‌తాసుధీంధ్ర మ‌ణిదీప‌కా ఓ క‌థానాయకా అంటూ మొద‌లైంది ఈ పాట‌.
అంటే కీర్తిలో మీకు సాటిలేరు.. ఆంధ్ర‌భోజ్య మీరు.. ప్ర‌జ‌ల మెప్పు పొందిన‌వారు.. మ‌ణిదీపం లాంటి వాళ్లు అంటూ ఎన్టీఆర్ ను అందంగా పొగిడారు ఆయ‌న‌.

ఇక మ‌ధ్య‌లో ఎన్టీఆర్ పోషించిన పురాణ పాత్ర‌ల గురించి కూడా ప్ర‌స్థావించి వాటి పోష‌కా అంటూ క‌ర్ణ‌.. సుయోధ‌న‌.. కృష్ణ‌.. రామ‌.. శివ‌.. బృహ‌న్న‌లను గుర్తు చేసారు. త్రిశ‌త‌కాధికా చిత్ర‌మాలికా జైత్ర‌యాత్రికా.. ఆహార్యాధ్భుత వాచికా ఓ క‌థానాయ‌కా అంటూ ఆయ‌న 300 సినిమాల‌ను కూడా గుర్తు చేసారు క్రిష్. ఇలా ఈ పాట‌లో ఏ మూల చూసుకున్నా కూడా అద్భుతాలే క‌నిపిస్తున్నాయి. అంత‌గా ఆ మ‌హాన‌టుడికి నీరాజ‌నం అందించాడు ద‌ర్శ‌కుడు క్రిష్. బాహుబ‌లి త‌ర్వాత ఆ స్థాయి సంగీతం ఏ సినిమాకు అందించ‌డంలో వెన‌క‌బ‌డిన కీర‌వాణి.. ఇప్పుడు మ‌ళ్లీ స‌త్తా చూపించాడు. కైలాష్ ఖేర్ వాయిస్ కూడా అద్భుతంగా ఉంది. మొత్తానికి ఈ పాట ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here