రెండు భాగాలుగా ఎన్టీఆర్ బ‌యోపిక్..

ఎన్టీఆర్.. ఎన్టీఆర్.. చ‌నిపోయిన 22 ఏళ్ల త‌ర్వాత కూడా ఇప్ప‌టికీ ట్రెండింగ్ లోనే ఉన్నాడు ఆ మ‌హాన‌టుడు. ఆయ‌న జీవితం తెర‌కెక్కుతుందంటే ఈ త‌రంలో కూడా ఏదో తెలియ‌ని ఆస‌క్తి. ఆయ‌న గురించి తెలుసుకోవాల‌నే ఆశ‌.. ఇప్పుడు క్రిష్ ఇదే చేస్తున్నాడు. అయితే అంత పెద్ద మ‌నిషి క‌థ ఒక సినిమాలో.. అందులోనూ రెండున్న‌ర గంట‌ల్లో చెప్ప‌డం సాధ్య‌మ‌య్యే ప‌నేనా అని ముందు నుంచి అనుమానాలు వ‌స్తూనే ఉన్నాయి.

Ntr-biopic

ఇక ఇప్పుడు దీన్ని నిజం చేస్తూ ఎన్టీఆర్ బ‌యోపిక్ రెండు భాగాలు చెప్పడానికి ఫిక్సైపోయారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. కేవ‌లం వెలుగు మాత్ర‌మే చూపి.. చీక‌టిని వ‌దిలేస్తారా అనే అనుమానాలు ఉండేవి. కానీ ఇప్పుడు ప‌రిస్థితులు చూస్తుంటే అన్నీ చూపించేలా ఉన్నారు. ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు అని తొలి భాగాన్ని.. ఎన్టీఆర్ ప్ర‌జానాయ‌కుడు అని రెండో భాగాన్ని తెర‌కెక్కిస్తున్నారు. తాజాగా ఫ‌స్ట్ లుక్ కూడా విడుద‌లైంది. జ‌న‌వ‌రి 9న ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు విడుద‌ల కానుంది.
ఫిబ్ర‌వ‌రి 14న రెండో భాగం విడుద‌ల కానున్న‌ట్లు తెలుస్తుంది.

హీరోగా ప్ర‌యాణం చూపించి.. సిఎం కావ‌డంతో తొలి భాగం ముగుస్తుంద‌ని.. అప్ప‌ట్నుంచి రాజ‌కీయాల‌ను రెండో భాగంలో చూపించ‌బోతున్నార‌ని తెలుస్తుంది. ఆయ‌న రాజ‌కీయ జీవితంలో అల్లుడే విల‌న్. ఈ విష‌యాన్ని అప్ప‌ట్లో ఎన్టీఆరే చెప్పాడు. న‌మ్మిన వాళ్లే త‌న‌ను మోసం చేసార‌ని మీడియా ముందే త‌న గోడు వెల్ల‌బోసుకున్నారు అన్న‌గారు. మ‌రి ఇప్పుడు ఎన్టీఆర్ బ‌యోపిక్ లో వియ్యంకుడినే విల‌న్ గా చూపించే ధైర్యం ఉందా..? ఈ పాత్ర‌లో రానా న‌టిస్తున్నాడు. మ‌రి ఆయ‌న పాత్ర‌ను ఎలా చూపించ‌బోతున్నారు..? ఇవ‌న్నీ ఆస‌క్తిగా మారాయి. ముఖ్యంగా రెండో బాగం అంతా రాజ‌కీయాలే ఉంటాయి కాబ‌ట్టి ఎవ‌ర్ని విల‌న్ గా చూపించాలో తెలియ‌క క్రిష్ కు తిప్ప‌లు త‌ప్ప‌క‌పోవ‌చ్చు. కానీ ఆయ‌న ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌పై అంద‌రికీ న‌మ్మ‌కం ఉంది. క‌చ్చితంగా ఈయ‌న ప్ర‌త్యేక‌థ స్క్రీన్ పై క‌నిపిస్తుంద‌నే అనుకుంటున్నారు ప్రేక్ష‌కులు. మొత్తానికి చూడాలిక‌.. ఎన్టీఆర్ బ‌యోపిక్ ఎలా ఉండ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here