ఎన్టీఆర్ బ‌యోపిక్ ఆడియో కోసం భారీ ఏర్పాట్లు..

ఎన్టీఆర్ బ‌యోపిక్ అంటే చిన్న విష‌యం కాదు. బ‌డ్జెట్ నుంచి ప్ర‌మోష‌న్ వ‌ర‌కు అన్నీ ఈ చిత్రానికి చాలా కొత్త‌గా ప్లాన్ చేస్తున్నాడు బాల‌కృష్ణ‌. పైగా ఈ చిత్రానికి త‌నే నిర్మాత కూడా. 70 కోట్ల‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు బాల‌య్య‌. క్రిష్ పై ఉన్న న‌మ్మ‌కంతో ఎంత అడిగితే అంత ఇస్తున్నాడు ఈ హీరో. ఈ చిత్రంలో బాల‌య్య 63 గెట‌ప్స్ లో క‌నిపిస్తున్నాడు. ఈ మ‌ధ్యే తోట‌రాముడు షూటింగ్ కూడా పూర్తి చేసాడు.

ntr biopic

అంత‌కుముందు డివిఎస్ క‌ర్ణ‌.. దానికి ముందు బొబ్బిలిపులి ఇలా ఎన్నో గెట‌ప్స్ మ‌ళ్లీ గుర్తు చేస్తున్నాడు బాల‌య్య‌. ఇదిలా ఉంటే ఈ చిత్ర షూటింగ్ ఇప్ప‌టికే పూర్తైపోయింది. క‌థా నాయ‌కుడు పూర్తైనా.. మ‌హానాయ‌కుడు మాత్రం ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఈ చిత్ర ఆడియో వేడుక డిసెంబ‌ర్ 16న తిరుప‌తిలో జ‌ర‌గ‌నుంది. దీనికోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమా వాళ్ల‌తో పాటు ఎన్టీఆర్ అభిమానులు.. పార్టీ కార్య‌క‌ర్త‌లు.. రాజ‌కీయ ప్ర‌ముఖులు కూడా ఈ ఆడియో వేడుక‌కు రానున్నారు. దాంతో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు చిత్ర‌యూనిట్. ఇక ఇప్పుడు షూటింగ్ కు చిన్న బ్రేక్ ఇచ్చాడు బాల‌య్య‌. తెలంగాణ ఎల‌క్ష‌న్స్ ఇప్పుడు ఎన్టీఆర్ బ‌యోపిక్ కు బ్రేక్ ఇచ్చాడు.

కొన్ని రోజులుగా ఎలాంటి విరామం లేకుండా షూటింగ్ చేస్తున్న బాల‌కృష్ణ‌.. ఇప్పుడు ఎన్నిక‌ల కోసం కొన్ని రోజులు షూటింగ్ కు దూరం అయ్యాడు. ఇప్ప‌టికే తొలి భాగం క‌థానాయ‌కుడు షూటింగ్ దాదాపు పూర్తైపోయింది. ఈ చిత్రం అనుకున్న‌ట్లుగానే జ‌న‌వ‌రి 9న విడుద‌ల కానుంది. ఇక రెండో భాగం మాత్రం ఎన్నిక‌ల త‌ర్వాత మిగిలిన పార్ట్ పూర్తి చేయాల‌ని చూస్తున్నాడు బాల‌య్య‌. ఇప్ప‌టికే తెలుగుదేశం కోసం ప్రచారం మొద‌లు పెట్టాడు బాలయ్య. డిసెంబ‌ర్ 7న పోలింగ్ ఉండ‌టంతో అప్ప‌టి వ‌ర‌కు ప్ర‌చారంతోనే బిజీగా ఉండ‌బోతున్నాడు ఈ హీరో. అందుకే ఇప్పుడు ఉన్న ప‌ది రోజుల్లో ఎంత వీలైతే అంత షూటింగ్ చేయాల‌ని చూస్తున్నారు బాల‌య్య‌.. క్రిష్. మ‌రి చూడాలిక‌.. క‌థానాయ‌కుడు విడుద‌లపై ఎవ‌రికీ ఎలాంటి అనుమానాలు లేవు కానీ మ‌హానాయ‌కుడు మాత్రం అనుకున్న స‌మ‌యానికి వ‌స్తుందా అనే అనుమానాలు అంద‌ర్లోనూ ఉన్నాయి. పైగా ఆడియో వేడుక కూడా అంతే భారీగా ప్లాన్ చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here