ఆట్.. అన్న‌గారు అదిరిపోయారుగా..

ఒక్కో పోస్ట‌ర్ విడుద‌ల‌వుతుంటే ఎన్టీఆర్ బ‌యోపిక్ పై ఎక్క‌డ‌లేని అంచ‌నాలు పెరిగిపోతున్నాయి. మ‌రి వీటిని రేపు విడుద‌లైన త‌ర్వాత ఎలా క్రిష్ బ్యాలెన్స్ చేస్తాడో తెలియ‌దు కానీ ఇప్పుడు మాత్రం అభిమానులు ఈ సినిమా గురించి ఆకాశ‌మే అనుకుంటున్నారు. అన్న‌గారిపై ఉన్న అభిమానానికి తోడు.. ఆయ‌న‌కు ఉన్న రాజ‌కీయ నేప‌థ్యం.. సినిమా స్టామినా.. ఇవ‌న్నీ క‌లిసి ఎన్టీఆర్ బ‌యోపిక్ పై అంచ‌నాలు రెండింత‌లు చేస్తున్నాయి. ఇప్పుడు విడుద‌లైన పోస్ట‌ర్ కూడా ఆస‌క్తి పెంచేసింది. అన్న‌గారు అలా న‌డిచొస్తుంటే పంచెక‌ట్టులో క‌నిపిస్తున్న ర‌చ్చ మామూలుగా లేదు.

NTR-Biopic-New-Poster-out
అలా కోపంగా.. ఆవేశంగా అడుగేస్తుంటే ఆంధ్రీ సీడెడ్ నైజాం అదిరిపోవ‌డం ఖాయం. అంత ద‌మ్ము ఆ క‌ళ్ల‌లో క‌నిపిస్తుంది.. ఆ న‌డ‌క‌లో మ‌న‌కు వినిపిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే పూర్త‌యింది. డిసెంబ‌ర్ 3 ఉద‌యం 7.42 నిమిషాల‌కు క‌థానాయ‌కుడులోని క‌థానాయ‌క పాట విడుద‌ల కానుంది. కీర‌వాణి దీనికి సంగీతం అందిస్తున్నాడు. క‌థానాయకుడు షూటింగ్ పూర్తైనా ఇంకా మ‌హానాయకుడు మాత్రం బ్యాలెన్స్ ఉంది. ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప్ర‌చారంలో బిజీగా ఉన్న బాల‌య్య‌.. ఆ త‌ర్వాత మ‌హానాయ‌కుడు పూర్తి చేయ‌నున్నాడు. జ‌న‌వ‌రి 9న క‌థానాయకుడు.. 24న మ‌హానాయ‌కుడు విడుద‌ల కానున్నాయి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here