నోటా.. మూడు రోజుల ముచ్చ‌ట‌..

విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు అఫీషియ‌ల్ గా ఓ ఫ్లాప్ వ‌చ్చేసింది. ఈయ‌న న‌టించిన నోటా భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైంది. తొలిరోజు టాక్ తో ప‌ని లేకుండా 7.50 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. అయితే రెండో రోజు నుంచి సినిమా దారుణంగా ప‌డిపోయింది. ఆదివారం క‌నీస వ‌సూళ్లు కూడా తీసుకురాలేదు. ఈ సినిమా మూడు రోజుల్లో కేవలం 10 కోట్ల షేర్ ద‌గ్గ‌రే ఆగిపోయింది. ఈ చిత్రం హిట్ కావాలంటే 25 కోట్లు రావాలి.. ఇప్పుడు ఏదైనా అద్భుతం జ‌రిగితే త‌ప్ప అంత రాదు.. చూస్తుంటే ఆ అద్భుతం జ‌రిగేలా క‌నిపించ‌డం లేదు. దాంతో ద్వార‌క త‌ర్వాత మ‌రో ఫ్లాప్ విజ‌య్ ఖాతాలోకి వ‌చ్చేసింది.

nota movie first day collections

ఓవర్సీస్ లో అయితే కనీస ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేదు ఈ చిత్రం. అక్కడ డిజాస్టర్ లకే డిజాస్టర్ గా నిలిచింది నోటా,మ‌ధ్య‌లో మ‌రో సినిమా వ‌చ్చింది.. ఏమంత్రం వేసావే అని.. దాన్ని విజ‌య్ కూడా ప‌ట్టించుకోలేదు కాబ‌ట్టి ప్రేక్ష‌కులకు కూడా ప‌నిలేదు ఆ సినిమాతో. అయితే ఇప్పుడు నోటా మాత్రం విజ‌య్ కు పెద్ద షాకే. ఎందుకంటే ఈ సినిమాతోనే త‌మిళ‌నాట కూడా అడుగుపెట్టాడు విజ‌య్.

కానీ తొలి సినిమాతోనే షాక్ తిన్నాడు. మ‌హేష్.. నాగార్జున‌.. నాని లాంటి హీరోల‌కు కూడా త‌మిళ్ ఇండ‌స్ట్రీ క‌లిసిరాలేదు. ఇప్పుడు ఇదే కోవ‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా చేరిపోయాడు. మొత్తానికి ఇప్పుడు నోటా ప‌రిస్థితి చూస్తుంటే క‌నీసం 10 కోట్లు ముంచేలా క‌నిపిస్తుంది. మొత్తానికి అర‌వ రాజ‌కీయాల‌కు బాగానే బ‌లైపోయాడు ఈ హీరో. ఇప్పుడు ఈయ‌న ఆశ‌ల‌న్నీ ట్యాక్సీవాలాపై ఉన్నాయి. అదేమో విడుద‌ల కావ‌డం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *