భార‌తీయుడు 2 త‌ర్వాత క‌మ‌ల్ సినిమాలు చేయ‌డా..?

చెప్పినట్లుగానే భారతీయుడు తర్వాత కమల్ హాసన్ సినిమా ఇండస్ట్రీకి దూరం కానున్నాడా..? ఏమో ఇప్పుడు ఈయ‌న‌ చేస్తున్న పనులు చూస్తే కచ్చితంగా భారతీయుడు కమల్ కు చివరి సినిమా అని అర్థం అయిపోతుంది. ఎందుకంటే ఆ తర్వాత పూర్తిగా రాజకీయాల్లోకి కాలం గడపాల‌ని ఫిక్సయిపోయాడు లోకనాయకుడు.

No More Films for me,says Kamal

అందుకే ఇప్పటి నుంచి పార్టీని బలోపేతం చేసుకునే పనిలో బిజీ అయిపోయాడు కమల్. ఓవైపు శంకర్ భారతీయుడు సినిమా కథను సిద్ధం చేస్తుంటే.. మరోవైపు కమల్ హాసన్ లోక్ స‌భ‌ ఎన్నికలకు తన పార్టీని సిద్ధం చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు తగ్గట్టుగా ఉంటుందని తెలుస్తోంది. భారతీయుడు సినిమాను 20 ఏళ్ల కింద లంచం నేపథ్యంలో తెరకెక్కించిన శంకర్ ఇప్పుడు దాని సీక్వెల్ ను పూర్తిగా రాజకీయం చేస్తున్నాడు. భారతదేశంలో మారిపోయిన రాజకీయ వ్యవస్థ గురించి భారతీయుడు 2లో ప్రస్తావించబోతున్నాడు శంకర్.

2.0తో అంచనాలు అందుకోలేకపోయిన ఈ దర్శకుడు భారతీయుడు 2ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. జనవరి నుంచి భారతీయుడు 2 పట్టాలెక్కనుంది. ఈ సినిమాలో కమల్ సరసన కాజల్ హీరోయిన్ గా నటించబోతోంది. దీనికోసం చందమామకు 2.30 కోట్ల పారితోషికం ఇచ్చారు. గతంలో ఒక‌సారి కమల్ హాసన్ తో నటించే అవకాశం వదిలేసుకున్న కాజల్ రెండో సారి మాత్రం భారీ పారితోషికం తీసుకొని ఒప్పుకుంది.

కమల్ హాసన్ కూడా భారతీయుడు సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని శంకర్ తో చెబుతున్నట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే కేవలం ఎనిమిది నెలలోనే ఈ సినిమా పూర్తి చేయనున్నారు శంకర్. 2019 దసరా విడుదలకు భారతీయుడు ప్లాన్ చేస్తున్నాడు ఈ దర్శకుడు. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను రెండు వందల కోట్లతో నిర్మించబోతుంది. మరి త‌న 50 సంవత్సరాల సినిమా కెరీర్ కు భారతీయుడుతో క‌మ‌ల్ ఎలాంటి ముగింపు పలుకుతాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here