అర‌వింద స‌మేత‌లో ఎన్టీఆర్ మాట్లాడ‌డంట‌..!

అదేంటి.. ఎన్టీఆర్ లాంటి హీరో మాట్లాడ‌కుండా ఉండ‌టం ఏంటి..? గ‌తంలో ఓ సారి అలాంటి ప్ర‌యోగం చేస్తే న‌ర‌సింహుడు అడ్ర‌స్ లేకుండా పోయింది క‌దా అనుకుంటున్నారా..? అయితే ఈ సారి మ‌రీ అంత దారుణం కాదులెండి.. మాట్లాడ‌కుండా ఉండటం అంటే ఇది త్రివిక్ర‌మ్ మార్క్ అన్న‌మాట‌. సాధార‌ణంగానే త్రివిక్ర‌మ్ హీరోలు చాలా త‌క్కువగా మాట్లాడుతుంటారు. ఇందులో మ‌రింత త‌క్కువ‌గా మాట్లాడ‌టం అన్న‌మాట‌.

NTR Working Stills From Aravinda Sametha
NTR Working Stills From Aravinda Sametha

సినిమా మొద‌లైన తొలి అరగంట‌లో అయితే ఎన్టీఆర్ అస‌లు మాట్లాడ‌డ‌ని చెప్పాడు త్రివిక్ర‌మ్. మ‌రీ అవ‌స‌రం అనుకున్న‌పుడు త‌ప్ప నోరు తెర‌వ‌డ‌ని చెప్పాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇంకా చెప్పాలంటే అత‌డు సినిమాలో మ‌హేష్ బాబులా ఉంటుంది ఇందులో ఎన్టీఆర్ పాత్ర‌. అయినా ఎన్టీఆర్ లాంటి హీరోను సైలెంట్ గా ఉంచ‌డం అంటే చిన్న విష‌యం కాదు. అయినా డైలాగులు రాయ‌డంతో త్రివిక్ర‌మ్.. చెప్ప‌డంలో ఎన్టీఆర్ అదుర్స్. మ‌రి ఈ ఇద్ద‌రూ క‌లిసిన‌పుడు కూడా కామ్ గా ఉండ‌టం అంటే చిన్న విష‌యం కాదు. ఇప్ప‌టికే అర‌వింద స‌మేత‌పై భారీ అంచ‌నాలున్నాయి. మ‌రి చూడాలిక‌.. త్రివిక్ర‌మ్ పాటించిన మౌన‌మంత్రం ఈ సినిమాకు ఎంత వ‌ర‌కు ప‌నికొస్తుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here