నిత్యామీనన్ అమ్మ అవుతుంది తెలుసా..?

అదేంటి.. పెళ్లి కాకుండా అమ్మ కావ‌డం ఏంటి.. విన‌డానికి కూడా అంత బాగోలేదు అనుకుంటున్నారా..? అవును.. మీరు న‌మ్మినా న‌మ్మ‌క‌పోయినా ఇదే నిజం. ఇప్పుడు అమ్మ అవుతుంది నిత్యామీన‌న్. ఈ విష‌యాన్ని ఆమె కూడా స్వ‌యంగా చెప్పింది.

ఇంత‌కీ విష‌యం ఏంటంటే ఈమె ఇప్పుడు రెండు భారీ బ‌యోపిక్ ల‌లో న‌టించ‌బోతుంది. ఒకేసారి రెండు భారీ సినిమాల్లో న‌టించే అవ‌కాశం రావ‌డంతో అమ్మ‌డు ఎగిరి గంతేయ‌డం ఒక్క‌టే త‌క్కువ‌. పొట్టివాళ్లు గ‌ట్టివాళ్లు అంటే ఏమో అనుకున్నారు కానీ ఇప్పుడు నిత్యామీన‌న్ ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. తాజాగా ఈమెకు ఎన్టీఆర్ బ‌యోపిక్ లోనూ న‌టించే అవ‌కాశం ఈ భామ‌కు వ‌చ్చింది.

nithya menen the iron lady jayalalithaa biopic

సావిత్రి పాత్ర కోసం ఈ భామ‌నే అడుగుతున్నాడు క్రిష్. ఇప్ప‌టికే ఫైన‌ల్ అయిపోయింది అని కూడా తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో ముందు బ‌స‌వ‌తార‌కం పాత్ర కోసం నిత్యాను అనుకున్నారు. కానీ వ‌దిలేసుకుంది. ఇప్పుడు సావిత్రి పాత్ర‌లో న‌టించ‌బోతుంది. దీనికి ముందు సావిత్రి బ‌యోపిక్ లోనూ ముందుగా త‌న‌నే అడిగార‌ని.. అయితే అనుకోని కార‌ణాల‌తో ఆ సినిమా చేయ‌లేక‌పోయాన‌ని చెప్పింది నిత్యా.

దీనికి రెమ్యున‌రేష‌న్ మాత్రం స‌మ‌స్య కాద‌ని చెప్పింది ఈ ముద్దుగుమ్మ‌. ఇక త‌మిళ‌నాడు అమ్మ జ‌య‌ల‌లిత బ‌యోపిక్ లోనూ ఈమె న‌టించ‌బోతుంది. దీనికి సంబంధించిన పోస్ట‌ర్ కూడా విడుద‌లైంది ఇప్పుడు. ప్రియ‌ద‌ర్శిని తెర‌కెక్కించ‌బోయే ఈ సినిమా త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌నుంది. మొత్తానికి ఇక్క‌డ సావిత్రి అమ్మ‌.. అక్క‌డ జ‌య‌ల‌లిత అమ్మ పాత్ర‌ల్లో న‌టించ‌డానికి ఒప్పుకుని అమ్మ అయిపోయింది నిత్యామీన‌న్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here