పొట్టివాళ్లు గట్టివాళ్లు అంటే ఏమో అనుకున్నారు కానీ ఇప్పుడు నిత్యామీనన్ ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఈమె మాట్లాడుతున్న తీరు చూసి అంతా షాక్ అవుతున్నారు. తెలుగు ఇండస్ట్రీపై చురకలు అంటించింది నిత్యామీనన్. తెలుగు ఒక్కటే కాదు.. అన్ని ఇండస్ట్రీల మీద తన అభిప్రాయం చెప్పింది ఈ ముద్దుగుమ్మ. వరసగా సినిమాలు ఎందుకు చేయడం లేదు అంటే నచ్చిన కథలు రావడం లేదంటూ ఓపెన్ గానే చెప్పింది నిత్యా.
ఈ కారణంతోనే సినిమాలు చేయడం లేదని.. తెలిసిన కథలు చేసి చేసి బోర్ కొట్టిందంటూ చెప్పింది నిత్యామీనన్. ఇప్పటి వరకు తాను కెరీర్ లో బాగా కష్టపడి చేసిన పాత్ర గంగ సినిమాలో అని చెప్పింది ఈ భామ. ఇక తెలుగులో ఎన్టీఆర్ బయోపిక్ లో బసవతారకం పాత్రలో నటించే అవకాశం ఈ భామకు వచ్చింది. కానీ వదిలేసుకుంది.
ఈ సినిమా గురించి ఇంతకంటే ఎక్కువ అడగొద్దు.. అందులో తాను నటించడం లేదని స్టేట్మెంట్ ఇచ్చింది అప్పట్లో. అయితే ఇప్పుడు ఇదే సినిమాలో సావిత్రి పాత్రలో నటిస్తుంది నిత్యామీనన్. ఎన్టీఆర్ జీవితంలో సావిత్రి పాత్ర కీలకం. ఆ సన్నివేశాలన్ని ఇప్పుడు బయోపిక్ లో చూపించబోతున్నాడు క్రిష్. ఇక సావిత్రి బయోపిక్ లోనూ ముందుగా తననే అడిగారని.. అయితే అనుకోని కారణాలతో ఆ సినిమా చేయలేకపోయానని చెప్పింది నిత్యా. దీనికి రెమ్యునరేషన్ మాత్రం సమస్య కాదని చెప్పింది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికి తనకు కథ నచ్చకపోతే స్టార్ హీరో ఉన్నా కూడా నిర్దాక్ష్యణ్యంగా నో చెప్పేస్తానని చెప్పింది నిత్యామీనన్. మొత్తానికి ఇప్పుడు మరి చూడాలిక.. ఎన్టీఆర్ బయోపిక్ లో నిత్యామీనన్ పాత్ర ఎలా ఉండబోతుందో..?