డిసెంబ‌ర్ లో వెంకీతో నితిన్ సినిమా..

వెంక‌టేశ్ సినిమాకు నితిన్ తో సంబంధం ఏంటి..? ఈ ఇద్ద‌రూ క‌లిసి మ‌ల్టీస్టార‌ర్ చేస్తున్నారా అనుకుంటున్నారా..? ఇక్క‌డ వెంకీ అంటే వెంక‌టేష్ కాదు.. వెంకీ కుడుముల‌. ఛ‌లో సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చాడు వెంకీ కుడుముల‌. ఈ ఏడాది తొలి బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చింది ఈ ద‌ర్శ‌కుడే.

Nithin Confirmed Venky Kudumula Movie

ఛ‌లోతో హిట్ కొట్టాడు. ఇప్పుడు రెండో సినిమాను నితిన్ తో ప్లాన్ చేసుకుంటున్నాడు. లై.. ఛ‌ల్ మోహ‌న్ రంగా.. శ్రీ‌నివాస క‌ళ్యాణం హ్యాట్రిక్ ఫ్లాపుల త‌ర్వాత ఈ హీరో వెంకీని న‌మ్ముకుంటున్నాడు. శ్రీ‌నివాస క‌ళ్యాణం త‌న కెరీర్ కు ఊపిరి పోస్తుంద‌ని న‌మ్మాడు కానీ అది కూడా ఉన్న ఉసురు తీసేసింది. దాంతో ఇప్పుడు ఈయ‌న ఆశ‌ల‌న్నీ వెంకీ సినిమాపైనే ఉన్నాయి.
ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్.

డిసెంబ‌ర్ లో ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌నుంది. దీనికి భీష్మ టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. సింగిల్ ఫ‌ర్ ఎవ‌ర్ అనేది ట్యాగ్ లైన్. పెళ్లికి దూరంగా ఉండాల‌నుకునే ఓ యువ‌కుడి క‌థ ఇది. అలాంటి వాడి లైఫ్ లోకి అమ్మాయి వ‌స్తే ఎలా ఉంటుంద‌నేది క‌థ‌. ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై రాధాకృష్ణ నిర్మించ‌నున్నాడు. డిసెంబ‌ర్ లో సెట్స్ పైకి తీసుకెళ్ళి వ‌చ్చే ఏడాది ఆగ‌స్ట్ లో విడుద‌ల చేయాల‌ని చూస్తున్నాడు వెంకీ. మ‌రి నితిన్ కోరుకుంటున్న హిట్ ఈ ద‌ర్శ‌కుడు అయినా ఇస్తాడో లేదో చూడాలిక‌..!

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here