వెంకీ కుడుముల సినిమాను అడ్డుకుంటున్న నితిన్..

అదేంటి.. త‌న సినిమాను త‌నే ఎందుకు అడ్డుకుంటాడు..? ఇప్పుడు నితిన్ క‌మిటైన ద‌ర్శ‌కుడు ఆయ‌నే క‌దా అనుకుంటున్నారా..? అవును.. హ్యాట్రిక్ ఫ్లాపుల తో రేస్ లో బాగా వెనుకబడిపోయిన నితిన్.. ఇప్పుడు వెంకీ కుడుముల సినిమాతో రానున్నాడు. శ్రీనివాస కళ్యాణం తర్వాత ఈ కుర్ర హీరో ఎక్క‌డా కనిపించడం లేదు. వెంకీ కుడుములతో సినిమా కన్ఫర్మ్ అయినా ఇంకా ప‌ట్టాలెక్కించ‌లేదు. దానికి ఒకే ఒక్క కార‌ణం ఉంది.. అదే నితిన్. ఈ విష‌యం కూడా దర్శకుడు వెంకీ కుడుముల చెప్పాడు. త‌న ట్విట్ల‌ర్లో అఫీషియ‌ల్ గా భీష్మ సినిమా ముచ్చ‌ట్లు చెప్పాడు వెంకీ. తాను త్వరలోనే తాను నితిన్ సినిమాను మొదలు పెట్టినట్లు కన్ఫర్మ్ చేశాడు ఈ దర్శకుడు. భీష్మ సినిమా స్క్రిప్ట్ సిద్ధంగా ఉన్నా ఇది పట్టాలెక్క‌కపోడానికి కారణం నితిన్ అని చెప్పాడు వెంకీ.

NITHIN VENKY KUDUMULA

శ్రీనివాస కళ్యాణం షూటింగ్ స‌మ‌యంలోనే నితిన్ భుజానికి గాయమైంది. దానికి చికిత్స తీసుకున్నాడు ఈ కుర్ర హీరో. కొన్ని రోజులుగా ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నాడు నితిన్. ఆ భుజం గాయం నుంచి కోలుకున్న తర్వాత వెంకీ కుడుముల సినిమాతో బిజీ కానున్నాడు ఈ హీరో. 2019 ఏడాది ఫిబ్రవరి నుంచి పట్టాలెక్కనుంది భీష్మ‌. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించనున్నాడు. చలో ఫేమ్ రష్మిక మందన్న హీరోయిన్. పెళ్లంటే అస్స‌లు పడని యువకుడి పాత్రలో నితిన్ నటించబోతున్నాడు. పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా భీష్మ సినిమాను తెరకెక్కించబోతున్నారు వెంకీ కుడుముల. ఈ సినిమాతో తన కెరీర్ గాడిన‌ పడుతుందని నమ్ముతున్నారు నితిన్. మరి ఈయ‌న ఆశ‌ల‌ను వెంకీ కుడుముల ఎంతవరకు నిలబెడతాడో చూడాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *