నిహారిక ఏం చేస్తుందిప్పుడు..? అక్క‌డేం ప‌ని..?

ఒకమనసు సినిమాతో ఇండస్ట్రీకి వచ్చింది నిహారిక. తొలి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపే తెచ్చుకుంది. అయితే మెగా కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి కచ్చితంగా ఆ అంచనాలు అనేవి భారీగానే ఉంటాయి. అది నిహారికకు కూడా తెలియంది కాదు. అవి అందుకోవడంలో తొలి సినిమాతో దారుణంగా ఫ్లాప్ అయింది ఈ భామ. ఫ్లాప్ తో పాటు పేరు ఖరాబ్ చేస్తుందంటూ విమర్శలు కూడా రావడంతో బాగా గ్యాప్ తీసుకుని రెండేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ హ్యాపీవెడ్డింగ్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది మెగా డాటర్.

niharika

అయితే ఈ సినిమా కూడా డిజాస్ట‌ర్ అయింది. దాంతో మెగా డాట‌ర్ ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. అయితే ఇప్పుడు నిహారిక రెండు సినిమాల‌తో బిజీగా ఉంది కానీ అవి ఎంత‌వ‌ర‌కు హిట్ అవుతాయ‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.
సీనియర్ హీరోయిన్ శ్రీయ‌తో క‌లిసి ఇందులో న‌టిస్తుంది నిహారిక‌. ఈ చిత్రానికి చాలా కాలం కిందే కొబ్బ‌రి కాయ్ కొట్టారు. సుజన్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రంతో ఇండ‌స్ట్రీకి వ‌స్తున్నాడు. క్రిష్ ఆస్థాన సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ ఈ చిత్రంతో నిర్మాతగా మారాడు. ఇప్ప‌టికే సినిమా స్క్రిప్ట్ అంతా అయిపోయి లాక్ అయిపోయింది.

త్వరలోనే మిగిలిన టీం కూడా ఎంచుకోనున్నారు. ఇక ఈ చిత్రానికి ఎ లిటిల్ బర్డ్ టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. ఇందులో శ్రియా, నిహారికలు అక్కాచెల్లెలుగా న‌టిస్తున్నార‌ని తెలుస్తుంది. ఇద్ద‌రూ నిత్యం కొట్టుకుంటూనే.. ఒక‌రికొక‌రు అన్న‌ట్లుగా ఉంటార‌ని.. ప్ర‌స్తుతం స‌మాజంలో ఉండే ప‌రిస్థితుల‌కు అద్దం ప‌ట్టేలా ఉంటుంద‌ని చెబుతున్నారు. మ‌రి చూడాలి.. నిహారిక ఈ చిత్రంతోనైనా ఫామ్ లోకి వ‌స్తుందో రాదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here