NGK అంటే ఏంటో చెప్పారుగా..!


ఈ రోజుల్లో క్రియేటివిటి చూపించ‌డానికి ప్లాట్ ఫామ్ తో ప‌నిలేదు. నీకు ద‌మ్ముంటే నీ స‌త్తా ప్ర‌పంచం చూస్తుంది. దానికి నీకు నువ్వు ప్లాట్ ఫామ్ ను సెట్ చేసుకోవాలంతే. ఇప్పుడు త‌మిళ‌నాట ఇదే చేసారు కొంద‌రు. సూర్య ఎన్ జి కే సినిమా పోస్ట‌ర్ ను త‌మ‌కు కావాల్సిన‌ట్లుగా మిగిలిన హీరోల‌కు అనున‌యించారు. సెల్వ రాఘ‌వ‌న్ తెర‌కెక్కిస్తోన్న సినిమాకు ఎన్ జి కే అనే ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్ పెట్టారు.
అంటే ఏంటో ఇన్నాళ్లూ తెలియ‌క ప్రేక్ష‌కుల బుర్ర‌లు కూడా హీట్ ఎక్కిపోయాయి. దానికి ఇప్పుడు నంద గోపాల కృష్ణ అంటూ క్లారిటీ ఇచ్చాడు ద‌ర్శ‌కుడు సెల్వ రాఘ‌వ‌న్. దీనికి సంబంధించిన కొత్త పోస్ట‌ర్స్ ఇప్పుడు విడుద‌ల చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. అప్పుడెప్పుడో విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. పైగా ఈయ‌న చెగువేరా గెట‌ప్ లో క‌నిపించాడు. అదింకా ఆస‌క్తి రేపింది.
అన్నింటికీ మించి సెల్వ సినిమా అంటే ఏదో కొత్త‌గా ఉంటుంద‌నే అంచ‌నాలు ఉంటాయి. ఈ పోస్ట‌ర్స్ సినిమాపై ఆస‌క్తి పెంచేసాయి. ఇవి ఎంత‌గా ప్ర‌భావం చూపించాయంటే.. ఎన్ జి కే పోస్ట‌ర్ విడుద‌ల త‌ర్వాత ఇదే పోస్ట‌ర్ లో మిగిలిన హీరోలు ఉంటే ఎలా ఉంటుంది అనే ఆలోచ‌న‌తో కొన్ని పోస్ట‌ర్లు డిజైన్ చేసారు కొంద‌రు ఔత్సాహికులు.
ర‌జినీకాంత్.. క‌మ‌ల్ హాస‌న్.. విజ‌య్.. అజిత్ తో పాటు శింబు, విజ‌య్ సేతుప‌తి, శివ కార్తికేయ‌న్ కూడా ఈ ఎన్ జి కే పోస్ట‌ర్స్ లో ఉన్నారు. ఈ పోస్ట‌ర్ చూసిన త‌ర్వాత సూర్య కూడా ఫిదా అయ్యాడు. వాళ్లు చేసిన వ‌ర్క్ మెచ్చుకున్నాడు. ఈ దెబ్బ‌తో ఎన్ జి కే సినిమాపై అంచ‌నాలు బాగానే పెరిగిపోయాయి. సాయిప‌ల్ల‌వి, ర‌కుల్ ఇందులో సూర్య‌తో జోడీ క‌డుతున్నారు. ఇదే ఏడాది ద‌స‌రా కానుక‌గా విడుద‌ల కానుంది ఎన్ జి కే. మ‌రి వ‌ర‌స ప్లాపుల్లో ఉన్న సూర్య‌-సెల్వ ఈ చిత్రంతో ఎలాంటి ఫ‌లితం అందుకుంటారో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here